సూర్య తమ్ముడు అనే గుర్తింపుతో తెరంగేట్రం చేశాడు కార్తి. ఐతే తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’తోనే అతడికి ఇక ఈ గుర్తింపు అవసరం లేదని తేలిపోయింది. అరంగేట్ర చిత్రంలోనే అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇవ్వడమే కాక కమర్షియల్‌గానూ మంచి విజయాన్నందుకున్న కార్తి.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. పయ్యా (ఆవారా), సిరుత్తై, ధీరన్ (ఖాకి), సర్దార్.. ఇలా కార్తి కెరీర్లో బ్లాక్ బస్టర్లు ఎన్నో.
సినిమాకు సినిమాకు సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తూనే కమర్షియల్‌గానూ మంచి విజయాలందుకుని ఒక రేంజిలో నిలబడ్డాడు కార్తి. ఇలాంటి నేపథ్యం ఉన్న హీరో నుంచి 25వ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. కానీ ‘జపాన్’ ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
కార్తి 25వ సినిమాగా ‘జపాన్’కు మంచి హైప్ వచ్చింది. ఈ దీపావళికి తెలుగులో వేరే సినిమాల్లేవు. తమిళంలో ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’తో పోటీ ఉన్నప్పటికీ కార్తి మూవీకే హైప్ ఎక్కువ కనిపించింది. ఇలాంటి టైంలో మంచి టాక్ వస్తే ‘జపాన్’ కార్తి కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటయ్యేది. కానీ ‘జపాన్’కు రెండు చోట్లా పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్లో కనిపించిన మెరుపులు.. సినిమాలో కనిపించలేదు. ట్రైలర్లో బాగా అనిపించిన సీన్లు కూడా సినిమాలో తేలిపోయాయి.
ట్రైలర్లో వెరైటీ మాడ్యులేషన్‌తో డైలాగులు పలికి ప్రేక్షకులను అలరించిన కార్తి.. సినిమాలో అదే స్టయిల్లో డైలాగులు చెబుతుంటే ఒక దశ దాటాక విసుగొచ్చింది. క్యారెక్టర్లో బలం లేకపోవడమే అందుక్కారణం. తన వంతుగా అతను బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ.. మూస కథ, విసుగెత్తించే కథనం సినిమాను నీరుగార్చేశాయి. సినిమా చివరి వరకు కూర్చోవడం కూడా కష్టమైన ఈ సినిమా తొలి రోజే డిజాస్టర్ అని తేలిపోయింది. కార్తి మైల్‌స్టోన్ మూవీగా ‘జపాన్’ లాంటి చిత్రాన్ని చేయడం అభిమానులు జీర్ణించుకోలేనిదే.
This post was last modified on November 10, 2023 9:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…