స్టార్ హీరో సినిమాల విషయంలో అభిమానుల ఎగ్జైట్ మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ వందల కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్నప్పుడు ప్లానింగ్ కొంచెం అటుఇటు అయినా ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. కానీ గేమ్ ఛేంజర్ బృందానికి అదేమీ పట్టడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి రిలీజ్ చేస్తామని చెప్పిన జరగండి జరగండి లిరికల్ వీడియోని వాయిదా వేశారని తెలియడంతో ఒక్కసారిగా నిరాశకు గురైన రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు.
దీనికి కారణాలైతే కనిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ ప్రస్తుతం విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నారు. భారీ జన సందోహం మధ్య కీలక సన్నివేశాలు జరుగుతున్నాయి. విపరీతమైన బిజీలో ఉండటంతో జరగండి పాట తాలూకు ఫైనల్ కట్ చూసే టైం లేదట. ఆయన ఓకే చేస్తే తప్ప నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ కంపెనీ సారెగమా ముందడుగు వేయలేవు. అదేదో వారం రోజుల క్రితమే సిద్ధం చేసుకుని ఉండాల్సిందనే కామెంట్ లో నిజం లేకపోలేదు. ఎప్పుడో లీకైపోయి ఎందరో వినేసిన పాటకు కూడా పోస్టు పోన్లు చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు.
చూస్తుంటే 2025 కంటే ముందు గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. శంకర్ పూర్తి ఫోకస్ ఇండియన్ 2 మీదే ఉంది. డబ్బింగ్ గత నెల మొదలుపెట్టారు. ఇంట్రో వీడియోని కమల్ బర్త్ డేకి వదిలారు. ఇండియన్ 3 కూడా వస్తుందని స్పష్టమైన లీకులు ఇచ్చారు. వేసవి విడుదలకి సిద్ధం కమ్మని కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందింది. ఈ లెక్కన గేమ్ ఛేంజర్ దగ్గరలో రావడం అనుమానమే. అలాంటప్పుడు ఇంత ముందుగా పాటలు విడుదల చేసి ప్రయోజనం ఉండదు. దగ్గరలో ఇంకేం పండగలు లేవు. నిట్టూర్చడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు.
This post was last modified on November 10, 2023 11:42 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…