ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) టెక్నాలజీని వాడుకుని ఒక ఫేక్ వీడియోని రష్మిక మందన్నకి ఆపాదించి వైరల్ చేయాలని చూసిన వైనం భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలిస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ పిలుపునివ్వడంతో ఈ వివాదం చాలా దూరం వెళ్లిపోయింది. బాలీవుడ్ డెబ్యూ గుడ్ బైలో ఈయన కూతురిగా రష్మిక మందన్న నటించిన కారణంగా ఆ బంధంతో బిగ్ బి స్పందించారు. ఇప్పుడు క్రమంగా ఆ సంఖ్య పదులు వందల నుంచి వేలు దాటే స్థాయికి చేరుకుంటోంది.
సినిమా తారలు కాబట్టి ఇలాంటి ఆటుపోట్లు ఎన్ని చూసి పుకార్లతో విసిగి వేసారి రాటుదేలిపోయి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఘటనే ఒక మధ్య తరగతి అమ్మాయికి జరిగితే తనతో పాటు తల్లితండ్రులు తట్టుకోగలరా. ఏదైనా అఘాయిత్యం జరిగితే ఎవరిది బాధ్యత. అసలు వీడియోలు సృష్టిస్తున్నదెవరో త్వరగా పసిగట్టలేని వ్యవస్థలో, ఒకవేళ పట్టుకున్నా సులభంగా బెయిలు మీద బయటికి వచ్చే చట్టాల్లో పరిష్కారం ఎక్కడుంది. ఇదే సగటు సామాన్యులు ఆన్ లైన్ వేదికగా సంధిస్తున్న ప్రశ్న. చదువుకోని, సాంకేతిక విషయాల పట్ల అవగాహన లేని సామాన్యులు ఇవన్నీ నిజమే అనుకుంటారుగా.
రష్మికకు జరిగిన దాన్ని ఖండిస్తూ నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, ప్రియా సర్కార్, ఆయుష్ జైన్, అనురాగ్ మీనా, బిఆర్ఎస్ నాయకురాలు కవిత కల్వకుంట్ల తదితరులు ట్వీట్లు చేశారు. అయితే దీన్ని తప్పని చెప్పే క్రమంలో చాలా మంది ఆ వీడియోని మళ్ళీ షేర్ చేయడంతో అప్పటిదాకా అసలీ విషయమే తెలియని వాళ్లకు కూడా వీడియో రీచ్ అవుతోంది. ఇది ఒకరకంగా మంచిదే అయినా ఇంకో కోణంలో చూస్తే రష్మికకి ఇబ్బంది తెచ్చేదే. కేంద్ర మంత్రిత్వ శాఖ సైతం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడే ఇలా ఉంటే ఈ ఏఐ టెక్నాలజీ ఫ్యూచర్ లో ఇంకెన్ని విపరీతాలు తీసుకొస్తుందో