ఒక బ్లాక్ బస్టర్, కల్ట్ మూవీ చేసిన హీరో, దర్శకుడి కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి కచ్చితంగా ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆశ్చర్యంగా నాయకుడు లాంటి ఆల్ టైం కల్ట్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కమల్ హాసన్, మణిరత్నం మాత్రం 40 ఏళ్ల పాటు ఇంకో సినిమానే చేయలేదు. మళ్లీ ఈ కలయికలో ఒక సినిమా వస్తుందని ఎవరూ ఊహించని సమయంలో గత ఏడాది కొత్త సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచారు ఈ లెజెండ్స్.
రీసెంట్ గా ఈ సినిమా టైటిల్, టీజర్ కూడా లాంచ్ అయ్యాయి. థగ్ లైఫ్ అనే క్రేజీ టైటిల్‌తో వీరి కలయికలో సినిమా రాబోతోంది. టీజర్ చూస్తే కమల్, మణిరత్నం కలిసి కమర్షియల్ హంగులున్న మంచి యాక్షన్ మూవీ చేయబోతున్నారని అర్థమైంది. ఇది వీళ్లిద్దరి కామన్ అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేసింది. ఇక టీజర్లో కమల్ తన పాత్ర పేరు చెబుతూ.. దాన్ని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పిన విధానం అందరి దృష్టినీ ఆకర్షించింది.
రంగరాజన్ శక్తివేల్ నాయకర్.. ఇదీ కమల్ పాత్ర పేరు. ఇందులో శక్తివేల్ అన్నది నాయకన్ సినిమాలో కమల్ మనవడి పేరు. ఒక సీన్లో మనవడిని పేరు అడిగి తెలుసుకుని.. తన పేరు కలిసి వచ్చేలాగే అతడికి పేరు పెట్టాడని తెలుసుకుని ఎమోషనల్ అవుతాడు కమల్. ఇప్పుడు శక్తివేల్ నాయకర్ అనే పేరుతో కమల్ వస్తుండటంతో నాటి నాయకుడు సినిమాలోని మనవడే ఇందులో హీరో అనే సంకేతాలు వస్తున్నాయి.
కాగా కమల్ పేరులో రంగరాజన్ అని ఉండడంతో దశావతారం ఆరంభంలో కనిపించే పాత్రతో ఈ సినిమాకు లింక్ ఉందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు థగ్ లైఫ్ టీజర్‌కు.. 1961లో వచ్చిన యోజింబో అనే ఒక జపనీస్ సినిమాతో పోలికలు కనిస్తుండటం గమనార్హం. ఆ సినిమా పోస్టర్లు చూస్తే టీజర్లో చూపించిన షాట్లతో పోలిక కనిపిస్తోంది. ఐతే కాన్సెప్ట్ టీజర్ వరకే స్ఫూర్తి పొందారా లేక కథ విషయంలోనూ ఇన్‌స్పైర్ అయ్యారా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో మాత్రం టీం విజయవంతమైంది.
This post was last modified on November 7, 2023 11:22 am
యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…
ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…
ఏపీలో సుమారు 12 కార్పొరేషన్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. వీటిలో రెండేరెండు కార్పొరేషన్లకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.…
ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పార్టీ సింబల్ ఎంతో ముఖ్యం. అందుకే, పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి రాజకీయ…
ఈ మధ్య సెన్సార్ బోర్డు విన్యాసాలు మామూలుగా ఉండట్లేదు. చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి.. చిన్న సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు…
స్థానిక ఎన్నికల్లోకొన్ని చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లు వార్తలు…