అనసూయ భరద్వాజ్‌ను హీరోయిన్ అని ఎవరూ సంబోధించరు కానీ.. హీరోయిన్లకు దీటుగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. జబర్దస్త్ షోకు దూరమయ్యాక కొంచెం లైమ్ లైట్ నుంచి పక్కకు వెళ్లింది కానీ.. అయినా సరే అనసూయను ఎవ్వరూ ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదు. తరచుగా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది అనసూయ. ఆమె ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పుడూ చర్చనీయాంశమే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడానికి కారణమేంటో చెప్పింది అనసూయ. టాలీవుడ్లో పార్టీలకు వెళ్లకపోవడమే తనకు ప్రతికూలంగా మారిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. షూటింగ్స్‌లో నా పని నేను చేసుకుని వెళ్లిపోతుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు నేను దూరంగా ఉంటాను. ఆ కారణంగానే నేను కథానాయికగా అవకాశాలు కోల్పోయాననుకుంటా. అలాంటి పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే వాటిని నేను ఎంకరేజ్ చేయను అని అనసూయ కుండబద్దలు కొట్టింది.
అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో నటించమంటే వేరే అమ్మాయిల మధ్య తనకు గుర్తింపు రాదన్న ఉద్దేశంతో ఆ అవకాశాన్ని తిరస్కరించానని.. పవన్ కళ్యాణ్ సినిమాకే నో చెబుతావా అని తనను అప్పట్లో చాలా ట్రోల్ చేశారని అనసూయ గుర్తు చేసుకుంది. ఐతే ఒకప్పట్లా తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని తాను ఇప్పుడు ఆలోచించట్లేదని.. ఎలాంటి పాత్రతోనైనా గుర్తింపు తెచ్చుకోగలననే నమ్మకం కలిగిందని.. అందుకే తాను భిన్నమైన పాత్రలు చేయగలుగుతున్నానని అనసూయ చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates