భావోద్వేగాలు ప్రధానాంశంగా రూపొందిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ కన్నడలో సంచలన విజయం నమోదు చేసుకుంది. తెలుగు డబ్బింగ్ కొంత ఆలస్యం కావడంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే అమెజాన్ ప్రైమ్ లో చూశాక మన ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యిందని సోషల్ మీడియా రెస్పాన్స్ చూశాక అర్థమయ్యింది. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సైడ్ బి నవంబర్ 17న ఒరిజినల్ వెర్షన్ తో పాటు సమాంతరంగా విడుదల చేయబోతున్నారు. సీక్వెల్ కి మంచి స్పందన వస్తుందనే నమ్మకంతో థియేటర్లకు తీసుకొస్తున్నారు. మూడు నిమిషాల ట్రైలర్ తో మ్యాటర్ చెప్పారు
ప్రియురాలి జీవిత లక్ష్యం కోసం చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించి వచ్చిన మను(రక్షిత్ శెట్టి)కు ప్రియ(రుక్మిణి వసంత్) జాడ దొరకదు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో ఒక ఎలెక్ట్రిక్ లాండ్రీ షాప్ లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో సురభి (చైత్ర)ని చూసి ఇష్టపడి పరిచయం పెంచుకుంటాడు. అయితే తనకు ఈ గతి పట్టించినవాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఒక్కొక్కరిని వేటాడటం మొదలుపెడతాడు. ఓ రోజు ప్రియా కనిపిస్తుంది. తర్వాత మను జీవితం ఏ మలుపులు తిరిగింది, చివరికి ఎవరి ప్రేమ పొందాడో తెరమీద చూడాలి.
మొదటి భాగంలో ఉన్న ల్యాగ్, హెవీ ఎమోషన్ కి భిన్నంగా సైడ్ బి ఆసక్తికరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రైమ్, రివెంజ్ యాంగిల్ జోడించడంతో ఇంటరెస్ట్ పెరిగింది. బాహుబలి లాగా అసలు కథని దర్శకుడు హేమంత్ రావు ఇందులోనే చూపించబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో ఆడియన్స్ ని ప్రేమలో పడేసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ కు ఇందులో స్కోప్ తగ్గించి ఎక్కువ కథ మీదే ఫోకస్ పెట్టారు. సైడ్ ఏ చూసిన వాళ్ళను ఇది కూడా చూడాలనిపించేలా ట్రైలర్ కట్ చేయడం అంచనాలు పెంచుతోంది. అజయ్ భూపతి మంగళవారంతో పోటీ పడుతున్న సప్తసాగరాలు దాటి సైడ్ బి ఈసారైనా మంచి ఫలితం అందుకుంటుందేంమో
This post was last modified on November 7, 2023 11:30 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…