ఎప్పుడో 1996లో వచ్చిన భారతీయుడు దర్శకుడు శంకర్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా అభిమానులు దాన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. ఒక వ్యవస్థలో లోపాలను హత్యల ద్వారా సరిచేయొచ్చనే సందేశాన్ని ఇచ్చిన తీరు ప్రేక్షకులను కదిలించింది. ముఖ్యంగా కన్న కొడుకు ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడని సేనాపతిని చూసి ఎందరో డైరెక్టర్లు అలాంటి కథలతో ఎన్ని సినిమాలు తీశారో లెక్క బెట్టడం కష్టం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 రాబోతున్నాడు. అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన కంబ్యాక్ ఇండియన్ పాటతో ఇంట్రో వీడియో తెలుగు వెర్షన్ రాజమౌళితో రిలీజ్ చేయించారు.
ఊహించినట్టే రెండో భారతీయుడు ఏం చేయబోతున్నాడో చెప్పేశారు. ఇండియాలో మళ్ళీ అవినీతి జడలు విరబోసుకుంది. ఉద్యోగమైనా కాంట్రాక్ట్ అయినా చేతులు తడపనిదే పనులు జరగడం లేదు. విసిగి వేసారి పోయిన జనం సేనాపతి మళ్ళీ వెనక్కు రావాలని డిమాండ్ చేస్తారు. ఊరువాడా ఏకమై గొంతెత్తుతారు. దశాబ్దాలుగా విదేశాల్లో స్థిరపడిన ఇండియన్ వాళ్ళ కోరిక విని రావాలని నిర్ణయించుకుంటాడు. వచ్చాక ఏం చేశాడు, ఎవరి భరతం ఎలా పట్టాడు అనేది తెరమీద చూడాలి. రెండు నిమిషాల వీడియోలో కమల్ హాసన్ ని ఒక్క షాట్ లో మాత్రమే రివీల్ చేసి సస్పెన్స్ పెంచారు.
విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. శంకర్ మార్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. అయితే కథ పరంగా కరప్షన్ తప్ప వేరేది తీసుకోవడానికి లేకపోవడంతో దాన్నే అల్లుకున్నారు. ఇతర క్యాస్టింగ్ ని వేగంగా చూపించారు. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్జె సూర్య, బాబీ సింహా, ఢిల్లీ గణేష్, మనోబాల లాంటి భారీ తారాగణంతో పాటు మన బ్రహ్మానందం గారు అలా తళుక్కున ఒక ఫ్రేమ్ లో మెరవడం విశేషం. ఇదింకా ఇంట్రోనే కాబట్టి టీజర్ లో అసలైన కంటెంట్ ని ఆశించవచ్చు. అయితే విడుదల తేదీ గురించి మాత్రం ఇందులో ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు. గేమ్ ఛేంజర్ నిర్ణయం కూడా దీని మీదే ఆధారపడి ఉంది.
This post was last modified on November 3, 2023 6:23 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…