నాని నలభై కోట్ల హీరో అయితే, సుధీర్‍బాబు సినిమాలు పది కోట్ల లోపు మార్కెట్‍కే పరిమితం అవుతాయి. అలాంటి హీరోకి తన సినిమాలో ఒక పాత్ర పోషించే అవకాశం వస్తే ఆ పాత్ర పరిధిపై వేరే హీరో అయితే షరతులు విధిస్తాడు. అతనెక్కడా తన పాత్రను డామినేట్ చేయకుండా, అతనికి ఎక్కువ సీన్ ఇవ్వకుండా దర్శకుడిపై ఒత్తిడి తెస్తాడు. కానీ నాని మాత్రం అలాంటి భేషజాలే లేకుండా ‘వి’లో సుధీర్ బాబుని హీరోలా చూపించే అవకాశమిచ్చాడు. సుధీర్ బాబుకి ఒక హీరోయిన్‍తో పాటు సిక్స్ ప్యాక్ చూపించే పెద్ద ఫైట్ సీన్ కూడా వుంది.
వి ట్రెయిలర్ చూసిన వారంతా నానికి అసలు ఎలాంటి ఇన్‍సెక్యూరిటీ కానీ, ఈగో కానీ లేదని మెచ్చుకుంటున్నారు. తన టాలెంట్‍పై తనకు విపరీతమైన నమ్మకం, కథకు ఏది అవసరమో గుర్తించే తత్వం ఒక నటుడిలో వుంటే తప్ప ఇది సాధ్యం కాదు. సుధీర్ పాత్ర ఎంతగా ఎలివేట్ అయితే తన క్యారెక్టర్ అంత ఛాలెంజింగ్‍గా మారుతుందని నాని గ్రహించాడు. అందుకే సుధీర్‍కి అంత డామినేటింగ్ స్క్రీన్ టైమ్ ఇచ్చాడు. అయితే ఈ చిత్రంలో ఊహించని ట్విస్ట్ ఒకటి వుంటుందని, అదే ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అని మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు.
అదితిరావు హైదరిని ట్రెయిలర్‍లో చూపించకపోవడం ద్వారా నాని చేసే క్రైమ్స్ కి కారణం ఆమెకు జరిగిన అన్యాయమేనని చాలా మంది కనిపెట్టేసారు. ఆమె ఫ్లాష్‍బ్యాక్‍తో లింక్ అయ్యే విలోని అసలు ట్విస్ట్ వుంటుందట. అదేంటో తెలుసుకోవడానికి సెప్టెంబర్ 5 జీరో అవర్ వరకు వేచి చూడక తప్పదు.