సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణం తర్వాత బాలీవుడ్ వారసులకు, వారితో సినిమాలు తీస్తోన్న వారికీ విపరీతమైన ట్రోలింగ్ ఎదురవుతోంది. ఆలియా భట్ సినిమా ‘సడక్ 2’ ట్రెయిలర్ రిలీజ్ అయితే ప్రపంచంలోనే ఎక్కువ మందికి నచ్చని ట్రెయిలర్గా యూట్యూబ్ రికార్డ్ దానికి సొంతమయింది. ఇప్పుడు చంకీ పాండే కూతురు అనన్య పాండే సినిమా ‘కాలీ పీలీ’ టీజర్ డిస్లైకర్స్ బారిన పడింది.
ఈ టీజర్‌కి ఇప్పటికే 1.5 మిలియన్ డిస్‌లైక్స్ తెచ్చుకుంది. ఇలా డిస్‌లైక్స్ తో పాటు టీజర్‌కి వ్యూస్ కూడా భారీగానే వస్తున్నాయనుకోండి. అది వేరే సంగతి. అయితే ఆలియా, అనన్య తదితరులు నటిస్తోన్న సినిమాలకు వస్తోన్న పబ్లిక్ రియాక్షన్ వారితో సినిమాలు తీస్తోన్న వారికి కలవరం పుట్టిస్తోంది.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం తీస్తోన్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ అనన్య పాండే. మరి ఆ సినిమా వచ్చేసరికి ఈ ద్వేషం ముదిరితే దానిని పూరి ఎలా కౌంటర్ చేస్తాడో. అసలే ఈ చిత్రానికి కరణ్ జోహార్ పేరు కూడా తోడయింది. అతనిపై వున్న ద్వేషమయితే తారాస్థాయిలో వుంది కనుక మొత్తం మీద పూరి సినిమా హిందీ వెర్షన్‌కి ఈ హేటర్స్ బెడద తీవ్రంగా వుండేలాగుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates