నిన్న సాయంత్రం దాకా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో పవన్ కళ్యాణ్ ఎక్కడని వెతికిన అభిమానులకు ఎట్టకేలకు గ్రీన్ టి షర్ట్ లో పవర్ స్టార్ దర్శనం ఇచ్చేటప్పటికీ ఆ వెలితి తీరిపోయింది. మెగా వెడ్డింగ్ లో కీలకమైన తాళికట్టు శుభవేళ ఘట్టం దిగ్విజయంగా ముగిసింది. మెగా ఫ్యామిలీతో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ అతిథులతో ఇటలీలోని పెళ్లి వేదిక ప్రాంగణం ప్రశాంతతని తలపించింది. మెల్లగా బంచుల వారిగా ఫోటోలు బయటికి వస్తున్నాయి. ఒక్కటి మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మెగా కుటుంబం మొత్తం దిగిన పిక్ బాగా వైరవుతోంది
ఒకరకంగా చెప్పాలంటే ఇది మెగా మల్టీస్టారర్ ఫోటోగా చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నాగబాబులతో కలిసి కొత్త జంట ముసిముసి నవ్వులతో ఫోజులివ్వడం చూడముచ్చటగా ఉంది. సగం టాలీవుడ్ ఇక్కడే ఉందంటూ మెగాభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఊరికే నోటి లెక్కగా మార్కెట్ వేల్యూ చూసుకున్నా ఫోటోలో ఉన్న వాళ్లందరివీ కలిపి నిర్మాణంలో ఉన్న సినిమాల విలువ రెండు వేల కోట్లకు చేరుతుంది. విశ్వంభర, గేమ్ ఛేంజర్, ఆర్సి 16, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, పుష్ప 2 ది రూల్ కలుపుకున్న చాలు ఇంకా ఎక్కువే కావొచ్చు
మిగిలినవాళ్లు మీడియం రేంజ్ కాబట్టి జోడించలేదు. చిరంజీవి పక్కనే బన్నీ దగ్గరగా ఉండటం ఈ ఫోటోలోని ప్రత్యేకత. గత కొంత కాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పెళ్లిలో అందరూ కలివిడిగా సందడి చేసిన క్షణాలు చాలానే ఉన్నాయి. నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారికంగా తెలియలేదు కానీ ప్రస్తుతానికి కన్ఫర్మ్ అనే అంటున్నారు. ఆ ఈవెంట్ లో మాత్రం టాలీవుడ్ బెస్ట్ మూమెంట్స్ ని చూసుకోవచ్చు. అంతమంది తారలు కలిసి వస్తే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవుగా.
This post was last modified on November 2, 2023 12:49 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…