మాళవిక మోహనన్.. ఈ అమ్మాయి నటించిన సినిమాల లిస్టు తీస్తే అంత గొప్పగా ఏమీ కనిపించదు. ‘మాస్టర్’ మినహా చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయలేదు ఈ మలయాళ కుట్టి. ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. అందులో తన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ వేయలేదు. కానీ మాళవిక సోషల్ మీడియాలో ఎంత పాపులరో ఆమె కోసం పడిచచ్చే కుర్రకారును అడిగితే తెలుస్తుంది. సినిమాలతో కంటే తన హాట్ హాట్ ఫొటో షూట్లతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిదీ భామ.
బాలీవుడ్లో దిశా పఠాని ఎలా అయితే కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుందో.. దక్షిణాది నుంచి అలాగే మాళవిక యువ హృదయాలను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో నదిలో శృంగార దేవతలా మారి ఆమె చేసిన ఫొటో షూట్ సోషల్ మీడియాను ఊపేసింది. మాళవిక అంటే గ్లామర్.. గ్లామర్ అంటే మాళవిక అనే స్థాయి ఇమేజ్ ఆమెది. అలాంటి మాళవిక ఈ రోజు తన ఫాలోవర్లందరికీ పెద్ద షాకే ఇచ్చింది.
విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘తంగలాన్’ సినిమాలో మాళవికనే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్ మోస్ట్ డీగ్లామరస్ రోల్ చేశాడు. తన లుక్ ఎప్పుడో బయటికి వచ్చింది కాబట్టి దానికి ప్రిపేరయ్యే ఉన్నారు. పైగా విక్రమ్‌కు ఇలాంటి డీగ్లామరస్ రోల్స్ కూడా కొత్త కాదు. కానీ మాళవికకు ఉన్న ఇమేజ్ వేరు. హీరో ఎలా ఉన్నా సరే.. హీరోయిన్ లుక్ వేరుగా ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఆమెను కూడా విక్రమ్‌కు దీటుగా డీగ్లామరస్‌గా, వయొలెంట్‌గా మార్చేశాడు పా.రంజిత్.
ఈ రోజు రిలీజైన టీజర్లో మాళవిక కనిపించింది ఒక్క షాట్లోనే అయినప్పటికీ.. అందులో ఆమె షాకింగ్ లుక్‌తో దర్శనమిచ్చింది. మాళవికను ఇలాంటి లుక్‌లో తన గ్లామర్ ఫ్యాన్స్ అస్సలు ఊహించి ఉండరు. ఎలాంటి అమ్మాయిని ఎలా తయారు చేశావయ్యా అంటూ పా.రంజిత్‌ను తమాషాగానే ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి టీజర్లోనే ఇంత షాకిచ్చిన మాళవిక.. సినిమాలో ఇంకెంతగా ఆశ్చర్యపరుస్తుందో చూడాలి.
This post was last modified on November 1, 2023 10:27 pm
సామాన్యులకు తట్టని అర్థం కాని విధంగా సినిమాలు తీసినా అన్ని వర్గాలను మెప్పించడం ఉపేంద్ర స్టైల్. 'ఏ'తో దాన్ని ముప్పై…
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో…
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…
క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…
తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను…