మెగా ఫ్యామిలీలో కొంచెం గ్యాప్ తర్వాత పెళ్లి సందడి చూస్తున్నాం. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్.. తాను కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందటే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ముందు అనుకున్నట్లే డెస్టినేషన్ వెడ్డింగే ప్లాన్ చేసుకున్నాడు వరుణ్. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, మిత్రుల మధ్య ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి.
మెగా ఫ్యామిలీలో దాదాపుగా అందరూ ఇటలీకి వెళ్లారు. ఇతర బంధువులు, సన్నిహితులు కలిపి అటు ఇటుగా వంద మంది నడుమ పెళ్లి జరుగుతోంది. సినిమా, పొలిటికల్ కమిట్మెంట్లతో బిజీగా ఉంటూ హైదరాబాద్‌లో జరిగే మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకలకు కూడా దూరపు చుట్టంలా వచ్చి వెళ్లే పవన్ కళ్యాణ్.. ఈ పెళ్లికి హాజరువుతాడా లేదా అన్న సందేహాలు తలెత్తాయి.
ఐతే భార్య అనా లెజ్‌నెవాతో కలిసి పవన్ ఇటీవలే ఇటలీకి బయల్దేరడంతో పెళ్లికి వెళ్తున్నాడని క్లారిటీ వచ్చింది. ఐతే రెండు రోజులుగా వరుణ్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుండగా.. అందులో ఎక్కడా పవన్ కనిపించడం లేదు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్.. ఇలా చాలామంది మెగా ఫ్యామిలీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. కానీ పవన్ ఫొటోలు మాత్రం దర్శనమివ్వడం లేదు.
దీని మీద మెగా అభిమానులు ఆసక్తిక చర్చలు పెడుతున్నారు. జోకులు పేలుస్తున్నారు. పవన్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఒక ఫొటో తీసి పోస్ట్ చేయాలని చిరును కోరుతున్నారు. కొందరేమో పవన్ ఇటలీకి వెళ్దామని ఎక్కడికి వెళ్లిపోయాడో అంటుంటే.. పెళ్లి కోసం వెళ్లి పుస్తకాలు చదువుతూనో, ఇటలీలో మాన్యుమెంట్స్ చూస్తూనూ గడిపేస్తున్నట్లున్నాడు జోకులు వేస్తున్నారు. వరుణ్ పెళ్లిలో పవన్ ఉన్న ఫొటో ఒకటి బయటికి వస్తే కానీ ఈ చర్చలు ఆగేలా లేవు.
This post was last modified on November 1, 2023 5:00 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…