నెలల తరబడి అక్కినేని అభిమానులు ఎదురు చూసి ఏకంగా మర్చిపోయిన నాగ చైతన్య డీజిటల్ డెబ్యూ దూత త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోందని డిజిటల్ వర్గాల కథనం. 24, మనం, ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ డ్రామా షూటింగ్ ఫినిష్ చేసుకుని చాలా కాలమయ్యింది. థాంక్ యు టైంలోనే చిత్రీకరణ పూర్తి చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే దాంతో పాటు లాల్ సింగ్ చడ్డా, కస్టడీలు వరసగా డిజాస్టర్ కావడంతో దూతను ప్రత్యేకంగా పట్టించుకునేవాళ్ళు లేకపోయారు. ఆ కారణంగానే అమెజాన్ ప్రైమ్ కొంత వేచి చూసే ధోరణి వహించిందనే టాక్ వచ్చింది.
ఏదైతేనేం డిసెంబర్ మొదటి వారంలో అది కూడా ఒకటో తారీఖునే దూతని రిలీజ్ చేయాలని ప్రైమ్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సాధారణంగా ఈ ఓటిటి ఫాలో అయ్యే ప్యాట్రన్ లోనే ఎనిమిది ఎపిసోడ్లు చెరో ముప్పావు గంట దాకా ఉండేలా ఫైనల్ కట్ సిద్ధం చేశారట. మాములుగా ఇలాంటివి వాటిని ప్రైమ్ చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. రకరకాల నగరాలు, ప్రదేశాల్లో ఈవెంట్లు చేస్తుంది. దానికి క్యాస్టింగ్ అందుబాటులో ఉండాలి. చైతు ప్రస్తుతం ఫ్రీగానే ఉన్నాడు. చందూ మొండేటితో చేయాల్సిన తండేల్ (ప్రచారంలో ఉన్న టైటిల్) ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ మీదున్నాయి.
ఒకవేళ దూత కనక డిసెంబర్ కన్ఫర్మ్ చేసుకుని చైతు ఎంతలేదన్నా రెండు మూడు వారాలు దాని ప్రమోషన్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. తన స్కూల్ కి భిన్నంగా దెయ్యాల కథలో నటించిన నాగ చైతన్య ఇందులో ఎలా ఉంటాడోననే ఉద్వేగం ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. రాజుగారి గది 2 నాగార్జున తరహా పాత్రలోనే దూతలో చైతు క్యారెక్టార్ ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ కు ఈ బ్యాక్ డ్రాప్ డీల్ చేయడం కొత్త కాదు. మాధవన్ 13B చాలా తక్కువ బడ్జెట్ తో తీసి సూపర్ హిట్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది. మరి దూతలో కూడా ఒళ్ళు జలదరించే సన్నివేశాలు చాలానే ఉంటాయట.
This post was last modified on October 31, 2023 7:02 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…