‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో విక్రాంత్ వంటి యంగ్ హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్‌గానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను విక్రాంత్ అందించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్షర్ థిల్లాన్‌లు హీరోయిన్లుగా నటించారు.
హృదయం, ఖుషి సినిమాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళంలో ప్రసిద్ద నటుడైన గురు సోమసుందరం ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ చిత్రం నవంబర్ 15న విడుదల కాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఎంతటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నాలుగో పాటను విడుదల చేశారు. ‘లేఖ లేఖ’ అంటూ సాగే ఈ పాట విక్రాంత్, మెహరీన్ మధ్య ప్రేమను చాటేలా ఉంది. వారిద్దరి కెమిస్ట్రీని చూపించేలా ఈ పాట సాగింది. లేఖ వచ్చాక విక్రాంత్ జీవితంలో వచ్చిన మార్పులను చెప్పేలా ఈ పాట ఉంది.
హేషమ్ అందించిన బాణీ.. అర్మాన్ మాలిక్ గాత్రం.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.. ఈ పాటను ఎంతో వినసొంపుగా మార్చాయి. ప్రతీ ఒక్కరి హృదయాన్ని స్పృశించేలా పాట ఉంది.
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…