చూస్తుంటే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కంటెంట్ తో పాటు లెన్త్ పరంగా కూడా షాక్ ఇచ్చేలా ఉన్నాడని బాలీవుడ్ వర్గాల కథనం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అనిమల్ నిడివి అక్షరాలా 3 గంటల 30 నిముషాలు లాక్ చేశారట. ఫైనల్ సెన్సార్ కాపీ కూడా అంత నిడివితోనే పంపించారని టి సిరీస్ వర్గాల కథనం. తన డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డిని కూడా సందీప్ నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ కొత్త హీరోతో అంత సుదీర్ఘమైన నిడివి అంటే థియేటర్ వర్గాల నుంచి మద్దతు దక్కదనే అనుమానంతో పాటు రిసీవ్ చేసుకోలేరన్న డౌట్ తో గంటకు పైగానే ఎడిట్ చేయించి వదిలాడు.
కానీ అనిమల్ కు మాత్రం అంత రాజీ పడనని నిర్మాతలతో అంటున్నట్టు తెలిసింది. దీనికి హీరో రన్బీర్ కపూర్ మద్దతు ఇస్తున్నట్టు వినికిడి. అదే కనక జరిగితే అనిమల్ కు రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సి రావొచ్చు. ఒకప్పుడు ఇలాగే చేసేవాళ్ళు. అమీర్ ఖాన్ లగాన్, సల్మాన్ హం ఆప్కె హై కౌన్ లకు డబుల్ విశ్రాంతి నిచ్చేవాళ్ళు. కానీ రోజుకు మూడు షోలు మాత్రమే సాధ్యమయ్యేవి. అలా అని టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండేది కాదు. కానీ వంద రోజులకు పైగా హౌస్ ఫుల్ కలెక్షన్లతో లాంగ్ రన్ దక్కేది కాబట్టి వసూళ్ల ఫిగర్లలో తేడాలు వచ్చేవి కాదు. బ్లాక్ బస్టర్లు పడేవి.
మరి సందీప్ అంతసేపు థియేటర్ ఆడియన్స్ ని కట్టి పడేయడం పెద్ద సవాలే. సినిమా మాత్రం ఎక్స్ ట్రాడినరిగా వచ్చిందని, చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడా బోర్ ఫీలవ్వకుండా కన్నార్పకుండా చూశారని, ఆ నమ్మకంతో సందీప్ వంగా అంత రిస్క్ కి రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి నిర్ధారించలేం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం రోజుకు అయిదారు షోలు వేసుకునే మల్టీప్లెక్సులకు చిక్కొచ్చి పడుతుంది. కాస్త త్వరగా ఆటలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన అనిమల్ లిరికల్ వీడియోస్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి.
This post was last modified on October 30, 2023 10:52 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…