Movie News

టైటిల్స్ కాస్త చూసుకోండి బాసూ..!

ఏదైనా సినిమాకు ఆసక్తి రేపడంలోనే కాదు ఓపెనింగ్స్ తేవడంలోనూ టైటిల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎంత కథకు అనుగుణంగా ఉన్నా సరే అది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోకుండా కేవలం దర్శకుల అభిరుచికి అనుగుణంగా పెడితే మాత్రం అది ఆడియన్స్ దాకా రీచ్ కాదని మరోసారి ఋజువయ్యింది. ఈ మధ్య కాలంలో కొన్ని అలాగే దెబ్బ తిన్నాయి. సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ కి కనీస వసూళ్లు దక్కడం లేదు. కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే తెలుగు నేటివిటీకి దూరంగా చరిత్రలో నిలిచిపోయిన ఒక విదేశీ నాయుకుడి పేరు పెట్టడం మైనస్ అయ్యింది.

చిరంజీవి స్టాలిన్ అని పెట్టుకోవచ్చు. స్టార్ హీరో కాబట్టి చెల్లిపోతుంది. కానీ కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ అంటే వర్కౌట్ కాలేదు. చిన్న హీరోతో నెపోలియన్ తీస్తే ఎవరూ చూడలేదు. ఇదంతా ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం. ఆ మధ్య శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1తో వచ్చారు. టైటిల్ చూసి ఇదేదో ఒక సామజిక వర్గానికి చెందిన సినిమా అనుకుని పొరబడిన చాలా మంది దూరంగా ఉన్నారు. దానికి తోడు టాక్ కూడా నెగటివ్ గా రావడంతో కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. కొత్త హీరోని పరిచయం చేసేటప్పుడు ఇలాంటి రిస్కులు తీసుకుంటే ఫలితాలు దారుణంగా ఉంటాయి.

ట్రెండ్ కు అనుగుణంగా ఆలోచించడంతో పాటు జనాలకు చేరేలా పేర్లు నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి చెప్పొచ్చు. కనీసం యావరేజ్ అనిపించుకోవాల్సినవి సైతం మొదటి రోజే షోలు క్యాన్సిల్ అయ్యేదాకా తెచ్చుకుంటున్నాయి. ఆ మధ్య రవితేజ తీసిన ఛాంగురే బంగారురాజాకి సినిమాలో ఉన్న క్రైమ్ కామెడీకి లంకె కుదరక ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. సిఎస్ఐ సనాతన్, భువన విజయం, స్లమ్ డాగ్ హస్బెండ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్ ఇవన్నీ పేర్ల దగ్గర పల్టీలు కొట్టినవే. దేంట్లోనూ స్టార్లు లేరు. ఇకనైనా టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది. 

This post was last modified on October 29, 2023 1:29 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago