Movie News

విక్ర‌మ్ కొత్త సినిమా టీజ‌ర్ భ‌లే ఉందే..

ట‌న్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా దాన్ని స‌రిగా వాడుకునే ద‌ర్శ‌కుడు లేక ప‌రాజ‌యాలు చ‌విచూస్తున్న క‌థానాయ‌కుడు విక్ర‌మ్. పితామ‌గ‌న్, సామి, అప‌రిచితుడు లాంటి భారీ విజ‌యాల‌తో ఒక‌ప్పుడు అత‌ను మామూలు క్రేజ్ తెచ్చుకోలేదు. కానీ ఆ త‌ర్వాత భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన అత‌డి సినిమాలేవీ ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా సోలో హీరోగా విక్ర‌మ్‌కు నిఖార్స‌యిన హిట్టే లేదు.

అయినా అతడి నుంచి పెద్ద పెద్ద సినిమాలు వ‌స్తూనే ఉంటాయి. క‌బాలి ద‌ర్శ‌కుడు పా.రంజిత్‌తో విక్ర‌మ్ తంగ‌లాన్ అనే భారీ చిత్రం ఒక‌టి చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే జ‌న‌వ‌రి 26న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. దీంతో పాటే విక్ర‌మ్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది.

విక్ర‌మ్ 62వ సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ఒక టీజ‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇదొక రూరల్ డ్రామా అనే విష‌యం టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఒక పోలీస్ స్టేష‌న్లోకి ఒక మ‌హిళ త‌న‌ను ఇద్ద‌రు రౌడీలు అల్ల‌రి చేశారని కంప్లైంట్ చేయ‌డానికి వ‌స్తుంది. అంత‌లో ఆ ఇద్ద‌రూ దెబ్బ‌లు తింటూ పోలీస్ స్టేష‌న్లోకి వ‌చ్చి ప‌డ‌తారు. వాళ్లను కొట్టిన వ్య‌క్తే హీరో.

ఐతే స్టేష‌న్లో జులుం చూపించిన హీరోను నువ్వెవ‌ర‌ని పోలీస్ గ‌ద‌మాయిస్తే త‌న గురించి చెవిలో ఏదో చెబుతాడు. అప్పుడా పోలీస్ భ‌య‌ప‌డ‌తాడు. ఇంత‌కీ హీరో నేప‌థ్యం ఏంట‌న్న‌దే ఈ క‌థ‌లా క‌నిపిస్తోంది. చివ‌ర్లో ఒక మామూలు స్కూట‌ర్ మీద మార్కెట్ వ‌స్తువులు తీసుకెళ్తూ క‌నిపించాడు హీరో. ఆ షాట్ ఆక‌ట్టుకుంది. మొత్తంగా టీజ‌ర్ రొటీన్‌కు భిన్నంగానే అనిపించింది. ప‌క్కా ఎంట‌ర్టైన‌ర్ చూడ‌బోతున్న ఫీలింగ్ క‌లిగించింది. ఇటీవ‌లే సిద్దార్థ్‌తో చిత్తా (తెలుగులో చిన్నా) అనే సినిమాతో హిట్ కొట్టిన అరుణ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.


This post was last modified on October 29, 2023 7:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago