తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తాను హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘సూరారై పొట్రు’ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి అతను ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
దక్షిణాదిన ఇలా నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న తొలి భారీ చిత్రం ఇదే. తమిళ సినీ పరిశ్రమలోనే కాదు.. సౌత్ ఇండియాలో ఇదో సంచలనంగా మారింది. తమిళ ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా సరే.. సూర్య తగ్గట్లేదు.
ఈ చిత్రానికి అమేజాన్ వాళ్లు రూ.60 కోట్ల రేటు పెట్టినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అది మరీ పెద్ద మొత్తం కదా.. అంతగా వాళ్లకు ఈ సినిమా ఏం ప్రయోజనం తెచ్చిపెడుతుంది అని సందేహించే వాళ్లూ లేకపోలేదు. కానీ సూర్య సినిమా కోసం లక్షల్లో కొత్త సబ్‌స్క్రిప్షన్లు వస్తాయనడంలో సందేహం లేదు. కచ్చితంగా ఈ యాప్‌కు ఆదరణ పెంచే సినిమా ఇది.
ఇక సూర్య సత్తా ఏంటో బాగా తెలిసే అమేజాన్ వాళ్లు ఈ సినిమాను కొన్నట్లు తెలుస్తోంది. ఏకంగా 200 దేశాల్లో ఈ సినిమాను ప్రైమ్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు అమేజాన్ ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సూర్యకు పాపులారిటీ ఉందని.. యాప్‌లో దీన్ని బాగా ప్రమోట్ చేస్తే ఎన్నో కోట్ల కొత్త ప్రేక్షకులకు ఇది రీచ్ అవుతుందని భావిస్తున్నట్లుంది. 200 దేశాల్లో విడుదల అంటే దీన్నో హాలీవుడ్ సినిమా లాగా ప్రమోట్ చేస్తారన్నమాట.
మామూలుగా ప్రాంతీయ సినిమాలను ఇలా ఇన్ని దేశాల్లో అందుబాటులోకి తేవడం, ఆ దిశగా ప్రమోట్ చేయడం జరగదు. కానీ సూర్య సినిమా అందుకు మినహాయింపు. రెండు నెలల ముందే రిలీజ్ డేట్ ప్రకటించారంటే.. మధ్యలో ఆన్ లైన్లో గట్టిగా ప్రమోట్ చేస్తారన్నమాట. తెలుగమ్మాయి సుధ కొంగర ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించింది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
This post was last modified on August 27, 2020 1:15 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…