తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకో నెల రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకో ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ.. అక్కడ ఇప్పటికే వాడి వేడి రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాల్లో సైతం రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయ కథలతో యాత్ర-2, వ్యూహం, శపథం, ప్రతినిధి-2 లాంటి సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సమకాలీన రాజకీయాల మీద సెటైరికల్ సినిమాలు కూడా వస్తున్నాయి.
అందులో భాగమే.. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్.. మార్టిన్ లూథర్ కింగ్. ఓటు విలువను తెలియజేసే సందేశంతో ముడిపడ్డ వినోదాత్మక కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నికల్లో కులం పాత్ర ఎలాంటిదో చెబుతూ.. దాని వల్ల తలెత్తే దుష్పరిణామాలను కూడా ఈ సినిమా చర్చిస్తుంది. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’ సినిమా ఆధారంగా.. మన నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
పూజ కొల్లూరు అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ఓ కీలక పాత్ర చేయడంతో పాటు దీనికి స్క్రిప్టు అందించాడు. కాగా సమకాలీన రాజకీయాలపై చాలా సెటైర్లు ఉన్న ఈ సినిమాలో.. పర్టికులర్‌గా కొన్ని సీన్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపించాయి. నరేష్ పాత్ర ద్వారా పరోక్షంగా జగన్ మీద సెటైర్లు వేయించడం విశేషం. ఇందులో ఆయన పాత్ర పేరు జగ్గు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డ అతను.. ప్రచారంలో భాగంగా జనాలను హత్తుకోవడం, ముద్దులివ్వడం చేస్తాడు.
ఒక మహిళా ఓటర్ దగ్గరికెళ్లి ఆమెను కౌగిలించుకుని ముద్దివ్వబోతే పక్కనున్న వాళ్లు ఆపుతారు. అలాగే మరో సీన్లో జనం ఎవ్వరూ లేని చోటు కూడా దండాలు పెట్టి చిత్రమైన హావభావాలు ఇస్తాడు నరేష్. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా జగన్ జనాలను కౌగిలించుకోవడం.. ముద్దులివ్వడం.. చేయి పెట్టి ఆశీర్వదించడం లాంటివి చేయడం గుర్తుండే ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక తిరుపతిలో ఒక గుడి ప్రారంభోత్సవానికి వెళ్లిన జగన్.. కింద జనాలే లేకపోయినా కొండ మీది నుంచి దండాలు పెడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
This post was last modified on October 28, 2023 3:04 pm
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…