ఒకప్పుడు తెలుగులోకి వచ్చే తమిళ సినిమాల డబ్బింగ్ విషయంలో ఎంత జాగ్రత్త పడేవాళ్లో తెలిసిందే. అవి అనువాద చిత్రాలనే ఫీలింగే వచ్చేది కాదు. తెలుగులో చక్కటి టైటిల్ పెట్టి.. డబ్బింగ్, పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాళ్లు. మణిరత్నం లాంటి దర్శకులైతే వేటూరి లాంటి లెజెండరీ లిరిసిస్టులను పెట్టుకుని పాటలు రాయించుకునేవారు. ఘర్షణ, సఖి, యువ లాంటి మంచి మంచి టైటిళ్లతో ఆయన అనువాద చిత్రాలు రిలీజయ్యాయి.
కానీ ఈ మధ్య తమిళ అనువాదాల తీరు తీవ్ర అభ్యంతరకంగా ఉంటోంది. ఇటీవలే రిలీజైన ‘లియో’ సినిమాలోని ఒక పాటకు రాసిన తెలుగు లిరిక్స్ చూసి మనోళ్లు షాకయ్యారు. ఇక డైలాగుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎవరో అనువాదకులను పెట్టుకుని మొక్కుబడిగా లాగించేస్తున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని తమిళ చిత్రాలకు తెలుగులో టైటిల్ పెట్టడానికి కూడా బద్ధకంగా ఉంటోంది. సింగం,
వలిమై, అయలాన్.. ఇలా తమిళ టైటిళ్లే పెట్టి సినిమాలను ఇక్కడ దించేస్తున్నారు. ఈ మధ్యే ప్రభుదేవా నటించిన ‘ఊల్ఫ్’ అనే సినిమాకు తెలుగులో ‘ఉల్ఫ’ అనే పేరు పెట్టి పోస్టర్ వదలడం గమనార్హం. తాజాగా ఇంకో తమిళ చిత్రం.. తమిళ టైటిల్‌తోనే తెలుగులోకి దిగేస్తోంది. అదే.. తంగలాన్. అసలా పదమేంటో.. దాని అర్థమేంటో మన వాళ్లెవ్వరికీ తెలియదు. పాన్ ఇండియా సినిమా అని చెప్పి అదే పేరుతో ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు.
ఇదేమీ చిన్నా చితకా సినిమా కాదు. విక్రమ్ హీరోగా ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ తీసిన భారీ చిత్రం. ఇలాంటి సినిమాను తెలుగులో రిలీజ్ చేసేటపుడు కనీసం తెలుగు టైటిల్ పెట్టడం కూడా కష్టమా అన్నది ప్రశ్న. తెలుగు ప్రేక్షకులు ఏ భాషా చిత్రాన్నయినా ఆదరించే విశాల హృదయులైనా సరే.. మరీ వాళ్ల అభిమానాన్ని ఇంత గ్రాంటెడ్‌గా తీసుకోవడం దారుణం. కనీసం తెలుగు టైటిల్ కూడా పెట్టలేని వాళ్ల సినిమాలను మన వాళ్లు అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న.
This post was last modified on October 28, 2023 3:12 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…