నిన్న కౌంట్ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి కానీ వేటికీ కనీస ఓపెనింగ్స్ లేక థియేటర్లు వెలవెలబోయాయి. దసరాకొచ్చిన వాటికే మంచి కలెక్షన్లు రావడం గమనించాల్సిన విషయం. అయినా ఉన్నంతలో పబ్లిసిటీ చేసుకుని జనాల దృష్టిలో పడ్డ బడ్జెట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. సంపూర్ణేష్ బాబు హీరోగా తమిళంలో యోగిబాబు చేసిన సూపర్ హిట్ మండేలా అఫీషియల్ రీమేక్ గా ఇది రూపొందింది. కేరాఫ్ కంచెరపాలం ఫేమ్ వెంకటేష్ మహా రచన చేయగా పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా బరిలో దిగిన ఈ కింగ్ సింహాసనం అందుకున్నాడా
పడమరపాడు గ్రామంలో చెప్పులు కొట్టుకుని జీవించే స్మైల్(సంపూర్ణేష్ బాబు) అనాథ. ఓ కొట్టు పెట్టుకోవాలని డబ్బు పోగేసుకుని పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ కోసం వసంత(శరణ్య ప్రదీప్)ని కలుస్తాడు. ఆమె సలహా మేరకు మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టేసుకుంటాడు. ఆ ఊరి దక్షిణ దిక్కు పెద్ద లోకి(వెంకటేష్ మహా), ఉత్తర దిక్కు నాయకుడు జగ్గు(నరేష్)లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడతారు. ఒక్క ఓటు గెలుపుని శాశిస్తుందని గుర్తించి మార్టిన్ ని ప్రసన్నం చేసుకోవడం మొదలుపెడతారు. అతని గొంతెమ్మ కోరికలన్నీ తీరతాయి. వసంతకు ఇదంతా పక్కదారి పట్టిన వాస్తవం అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ
ఓటు విలువని తెలియజెప్పే ఉద్దేశంతో రూపొందిన ఒరిజినల్ వెర్షన్ కు వీలైనంత మార్పులు చేయకుండా యధాతథంగా తీసేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో కథనం నెమ్మదిగా సాగుతుంది. మంచి సీన్లు, ఆలోచింపజేసే సంభాషణలు కొంతమేర కాపాడినా సెకండ్ హాఫ్ లో జరిగిన సాగతీతతో పాటు క్లైమాక్స్ ని ప్రేక్షకుల ఊహకే వదిలేయడం వర్కౌట్ కాలేదు. ఒకదశ దాటాక సంపూ స్థాయికి మించిన బరువు పాత్ర మీద పడటంతో తను మోయలేకపోయాడు. కామెడీ వరకు మెప్పించాడు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేయడం కష్టమనిపించే మార్టిన్ లూథర్ కింగ్ మెసేజ్ ఇచ్చాడు కానీ ఎంటర్ టైన్ చేయలేకపోయాడు.
This post was last modified on October 28, 2023 10:48 am
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…