జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ప్రస్తుతం దేవర మీదే ఉన్నప్పటికీ.. యంగ్ టైగర్ తర్వాత చేయబోయే ప్రాజెక్టు విషయంలో వాళ్ల క్యూరియాసిటీ తక్కువగా ఏమీ లేదు. ఆ చిత్రంతోనే తారక్ బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి తారక్ చేయబోతున్న వార్-2 ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదికి వెళ్తుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం విరామం లేకుండా దేవర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు తారక్.
ఇటీవలే వార్-2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హైదరాబాద్‌కు వచ్చి తారక్‌తో స్క్రిప్టు, షెడ్యూళ్ల గురించి మాట్లాడి వెళ్లాడు. తాజాగా హీరో రణబీర్ కపూర్ వార్-2 గురించి అప్‌డేట్ ఇవ్వడం విశేషం. తాను అయాన్‌తో బ్రహ్మాస్త్ర-2 కూడా చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. వార్-2 షూట్ గురించి మాట్లాడాడు రణబీర్. ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో మొదలవుతుందని అతను చెప్పాడు.
అంతే కాక వార్-2 షూటింగ్ వచ్చే ఏడాది మూడో క్వార్టర్లోనే పూర్తయిపోతుందని అతను సంకేతాలు ఇవ్వడం విశేషం. బ్రహ్మాస్త్ర-2 చిత్రాన్ని తాము వచ్చే ఏడాది చివర్లో లేదా 2025 ఆరంభంలో మొదలుపెడతామని రణబీర్ వెల్లడించాడు. బ్రహ్మాస్త్ర-1 అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో 2, 3 భాగాలు ఉండకపోవచ్చనే చర్చ జరిగింది. ఈ ప్రచారానికి రణబీర్ తెరదించాడు.
ఆల్రెడీ బ్రహ్మాస్త్ర-2 స్క్రిప్టు వర్క్ నడుస్తోందని.. తనకు అయాన్ కథ కూడా వినిపించాడని చెప్పాడు. బ్రహ్మాస్త్ర-1కు వచ్చిన ఫీడ్ బ్యాక్ అంతా తాము తీసుకున్నామని.. అందులో దొర్లిన తప్పులను సరదిద్దుకుంటామని.. బ్రహ్మాస్త్ర-2 అంచనాలను మించి ఉంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. బ్రహ్మాస్త్ర-1తో పోలిస్తే పదిరెట్లు భారీగా ఉంటుందని రణబీర్ చెప్పడం విశేషం. మొత్తానికి బ్రహ్మాస్త్ర-2 విషయంలో సందేహాలేమీ అవసరం లేదని రణబీర్ మాటల్ని బట్టి అర్థమైంది.
This post was last modified on October 25, 2023 9:25 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…