సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్ గా మెప్పించడం అంత సులభం కాదు. అందులోనూ పెద్దగా పరిచయం లేని, బక్కపలచని దేహంతో వినాయకన్ లాంటి ఆర్టిస్టు దాన్నో ఛాలెంజ్ గా తీసుకుని శబాష్ అనిపించుకోవడం మాటలు కాదు. శారీకరంగా ఇంత బలహీమైన విలన్ ని రజని చిత్రాల్లో చూసి ఉండం. అందుకే అంత ప్రత్యేకంగా గుర్తుండిపోయాడు. తాజాగా ఇతను నిజంగానే జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. చెన్నై ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్ లో తాగి గొడవ చేశాడనే కారణంగా అరెస్ట్ చేసి కారాగారంలో పెట్టేశారు. తాగిన మత్తులో ఇతగాడు విచిత్రంగా ప్రవర్తించాడట.
అసలు కథ ఏంటంటే వినాయకన్ నివసించే అపార్ట్ మెంట్ లో ఇతని వల్ల విపరీతమైన డిస్టర్బెన్స్ వస్తోందని చుట్టుపక్కల వాళ్ళు కంప్లయింట్ ఇచ్చారు. దీని కోసం వివరణ ఇవ్వాల్సిందిగా సదరు అధికారులు సమన్లు పంపించారు. అయితే మాములుగా వెళ్లి ఉంటే ఏమయ్యేదో కానీ సినిమా స్టైల్ లో తాగి వెళ్లి నానా గొడవ చేశాడు. అనవసర వాదనకు దిగడం, డ్యూటీలో ఉన్న ఆఫీసర్లతో దురుసుగా ప్రవర్తించడంతో ఒక దశ వరకు ఓపిగ్గా భరించిన పోలీసులు ఆ తర్వాత తాళలేక కేసు పెట్టేశారు. కోర్టులో హాజరు పరిచాక బెయిల్ వస్తుంది కానీ ఇదైతే చెడ్డ పేరు తెచ్చే వ్యవహారమే.
జైలర్ టైటిల్ కు తగ్గట్టు వినాయకన్ జైలుకు వెళ్లడం నిజంగానే కామెడీ అనిపిస్తోంది. అయినా నటులం కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో కొందరు నటులు ప్రవర్తించడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనలే ప్రేక్షకుల్లో చులకన భావాన్ని ఏర్పరుస్తాయి. ఎప్పటి నుంచో పరిశ్రమలో ఉన్న వినాయకన్ కళ్యాణ్ రామ్ అసాధ్యుడులో నటించాడు. పలు తమిళ మలయాళ చిత్రాలు అంతగా పేరు తీసుకురాలేదు. లేక లేక జైలర్ తో ఇంత పెద్ద బ్రేక్ వస్తే ఈ జైలుకు వెళ్లే పనులు చేయడం ఏమిటో. దీన్నే విపరీత బుద్ది అంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates