విజయ్  68కి వినయ విధేయ రామ లింకు  

ఇటీవలే లియో రూపంలో టాక్ ఎంత డివైడ్ గా ఉన్నా సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఎక్కువ ఆలస్యం చేయకుండా తన కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. చెన్నైలో జరిగిన ప్రారంభోత్సవంలో మొత్తం క్యాస్టింగ్ హాజరు కాగా షూటింగ్ ని లాంఛనంగా ప్రారంభించేసారు. ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ 15 రోజుల షూటింగ్ జరిగిపోయిందని కోలీవుడ్ టాక్. లియో రిలీజ్ టైంలో ఈ విషయాన్ని బయటికి చెబితే అభిమానులను డైవర్ట్ చేసినట్టు అవుతుందని  గుట్టుగా ఉంచారట. అఫీషియల్ గా ఒక ప్రోగ్రాం చెయాలి కాబట్టి దానికి దసరాని ముహూర్తంగా ఫిక్స్ చేసుకుని ఫ్యాన్స్, మీడియాకు చెప్పారు.

సరే దీనికి వినయ విధేయ రామకు లింక్ ఏంటనేగా డౌట్. ఇందులో సీనియర్ హీరో జీన్స్ ప్రశాంత్, మాజీ హీరోయిన్ స్నేహ జంటగా నటిస్తున్నారు. కథలో వీళ్ళవి చాలా కీలక పాత్రలు. రామ్ చరణ్ సినిమాలో వీళ్ళే అన్నా వదినలుగా నటించడం మర్చిపోలేం. ఇప్పుడా పాయింట్ నే పట్టుకుని ఇదేమైనా నెగటివ్ సెంటిమెంట్ అవుతుందేమోనని మెగా ఫ్యాన్స్ టీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా చేయడం లేదు. కథ ఎంతో నచ్చితే కానీ ఓకే చెప్పడం లేదు. ఆయన వినయ విధేయ రామ తర్వాత ఒప్పుకున్నది కూడా ఇదే. నితిన్ మాస్ట్రో రీమేక్ లో హీరో ప్రశాంతే అంటే నమ్మగలరా.

సరే ఇవన్నీ వినడానికి నవ్వుకునేలా ఉంటాయి కానీ ఒకవేళ నిజమైతే మాత్రం షాక్ ఇస్తాయి. మన చైతుకి కస్టడీ లాంటి అల్ట్రా డిజాస్టర్ ఇచ్చిన వెంకట్ ప్రభు దీనికి దర్శకుడు. చాలా డిఫరెంట్ పాయింట్ తో రూపొందిస్తున్నారట. మీనాక్షి చౌదరి, ప్రియాంకా మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఎస్జె సూర్య, ప్రభుదేవా, లైలా, జయరాం, జై తదితరులు ఇతర తారాగణంలో భాగం. ఫుల్ స్వింగ్ లో అనిరుద్ రవిచందర్ కాకుండా వెంకట్ ప్రభు తన ఆస్థాన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు సంగీత బాధ్యతలు అప్పజెప్పారు.