ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే మంచి ఫలితాలందుకుని.. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన హీరో నేచురల్ స్టార్ నాని. ఆల్రెడీ టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా మంచి స్థాయిలోనే ఉన్నాడు నాని. ఐతే ప్రతి హీరో ఒక స్థాయి అందుకున్నాక తర్వాత రేంజికి వెళ్లడానికి ప్రయత్నించడం మామూలే. నాని కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. తన మార్కు క్లాస్ టచ్ ఉన్న, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు మాస్ టచ్ ఉన్న సినిమాలు కూడా ప్రయత్నిస్తున్నాడు.
ఒకప్పుడు ‘ఎంసీఏ’.. ఈ మధ్య ‘దసరా’ లాంటి చిత్రాలు నానికి మాస్‌లో ఫాలోయింగ్ పెంచాయి. క్లాస్ పాత్రలు మాత్రమే చేయగలడన్న ముద్రను చెరిపేశాయి. ముఖ్యంగా ‘దసరా’తో అతను పెట్టిన బాక్సాఫీస్ నంబర్లు చూసి చాలామంది షాకయ్యారు. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు.. ఇలా అన్ని రకాలుగా నాని స్థాయిని పెంచిన సినిమా అది. అలా మైండ్ లెస్ మాస్ చూపించలేదు అందులో. కథాకథనాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. మాస్ టచ్ ఇస్తూనే ఇలా వైవిధ్యం కూడా చూపించడం నాని ప్రత్యేకత.
తమిళంలో సూర్య ఇలాంటి ప్రయత్నాలే చేస్తుంటాడు. ఇప్పుడు నాని ‘దసరా’ బాటలోనే మరో మాస్ టచ్ ఉన్న ప్రయోగాత్మక సినిమాకు రెడీ అయ్యాడు. అదే.. సరిపోదా శనివారం. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ చూస్తే.. ‘గజిని’ లాంటి సినిమాలు గుర్తుకు వచ్చి ఉంటే ఆశ్చర్యం లేదు. అందులో మాస్ ఉంటుంది. అదే సమయంలో కథలో వైవిధ్యం కూడా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు అంచనాలకు తగ్గట్లు ఉంటే వాటి రేంజే మారిపోతుంది. ‘సరిపోదా శనివారం’లో హీరోకు శనివారం బాగా కలిసొచ్చి ఆ రోజు ఉగ్రరూపం చూపించేలా కనిపిస్తున్నాడు.
ఇలా ఏదో ఒక రోజు హీరోకు కలిసి రావడం ఏంటన్నది క్యూరియాసిటీ పెంచే అంశం. ఈ పాయింట్ వైవిధ్యమైన సినిమాలు చూడాలనుకునేవారిలో ఆసక్తిని పెంచుుతోంది. అదే సమయంలో నాని ఈ సినిమాలో వీర విధ్వంసం చేయబోతున్నాడనే సంకేతాలు కూడా కనిపించాయి. అది మాస్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలా వైవిధ్యం, మాస్ రెంటినీ మిక్స్ చేసిన వివేక్ ఆత్రేయ ఫస్ట్ గ్లింప్స్‌తో బాగానే సినిమాకు హైప్ తీసుకురాగలిగాడు. అంచనాలకు తగ్గట్లు సినిమా తీస్తే దీని బాక్సాఫీస్ రేంజే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 24, 2023 12:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…