అప్డేట్స్ కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్న మహేష్ బాబు అభిమానులకు ఊరట కలిగిస్తూ ఎట్టకేలకు దసరా పండగ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది హారిక హాసిని సంస్థ. కారు వెనుక డిక్కీ ఓపెన్ చేసి దాని మీద మహేష్ కూర్చుని స్టైల్ గా బీడీ వెలిగించే స్టిల్ తో పాటు కాళ్ళ కింద కత్తి పట్టుకున్న రౌడీ పడిపోయిన ఫోజు చూపించారు. ప్రమోషన్లలో మొదటిసారి వదిలిన పోస్టర్ లో కూడా బీడీనే హైలైట్ చేయడం, ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ చివరి షాట్ లో బీడీ కాల్చుకుంటూ నడిచి వచ్చే సన్నివేశాన్నిసెట్ చేయడం ఇదంతా మాస్ కోసమే.
బాగానే ఉంది కానీ ఇంతగా మహేష్ తెరమీద చుట్టలు, బీడీలు కాల్చి చాలా సంవత్సరాలయ్యింది. ఫ్యాన్స్ మాత్రం ఒకప్పటి పోకిరి రేంజ్ లో ఇందులో స్మోకింగ్ ఉంటుందని ఆశిస్తున్నారు. నిజానికి గుంటూరు కారం అందరూ అనుకున్నట్టు ఏదో కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసి మాస్, క్లాస్ ఎవరినీ వదిలిపెట్టకుండా అల వైకుంఠపురములో కంటే మూడింతలు ఎక్కువ ఎగ్జై టింగ్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
ఫస్ట్ ఆడియో సింగల్ కి సంబంధించిన డేట్ మాత్రం ఇవ్వలేదు. కమింగ్ సూన్ అన్నారు తప్పించి స్పష్టంగా తేదీ లేదు. నవంబర్ నుంచి గుంటూరు కారం సందడి స్టార్ట్ అవుతుందని నిన్న తమన్ ట్వీట్ పెట్టాడు. అంటే మొదటివారం లేదా దీపావళి నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్లు ప్లాన్ చేసుకున్నారు. జనవరి 12 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆర్టిస్టులు డేట్లు సర్దుబాటు చేసి మరీ గుంటూరు కారం బృందానికి సహకరిస్తున్నారు. నాగవంశీ గతంలో చెప్పినట్టు దసరా లోపే పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామన్నారు కానీ అది సాధ్యపడలేదు. టీజర్ దీపావళికి ఆశించవచ్చు.
This post was last modified on October 23, 2023 9:47 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…