తమిళ హీరో, నిర్మాత విశాల్.. గత ముంబయి సెన్సార్ బోర్డులో అవినీతిపై చేసిన ఆరోపణలు.. అతను రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ సెన్సార్ చేయించేందుకు రూ.6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. స్క్రీనింగ్‌కు రూ.3 లక్షలు, సెన్సార్ సర్టిఫికేషన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చానంటూ ఎవరెవరికి డబ్బులు పంపింది అకౌంట్ వివరాలతో సహా అతను సోషల్ మీడియాలో పెట్టేశాడు.
ఈ వ్యవహారం ఫిలిం ఇండస్ట్రీలో దుమారం రేపింది. సెన్సార్ బోర్డులో అవినీతి గురించి వివిధ ఇండస్ట్రీల్లో పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కూడా దీని మీద డిస్కషన్లు నడిచాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించగా.. కేంద్ర సెన్సార్ బోర్డు కూడా సమీక్షలు నిర్వహించి కొన్ని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా ఇతర భాషల నుంచి హిందీలోకి అనువాదం అయ్యే చిత్రాలను.. ఆయా భాషల కేంద్ర స్థానాల నుంచే సెన్సార్ చేయించే ఆలోచన చేస్తోంది కేంద్ర సెన్సార్ బోర్డు. దీని ప్రకారం తెలుగు నుంచి ఒక సినిమా హిందీలోకి డబ్ చేస్తున్నట్లయితే.. హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసి అక్కడే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తారన్నమాట.
సమస్య ఎదురైంది తమిళ సినిమాకు కాబట్టి ముందుగా తమిళం నుంచి హిందీలోకి వచ్చే సినిమాల కోసం చెన్నైలో స్థానికంగా ఒక స్పెషల్ సెన్సార్ టీంను పెడుతున్నారట. ట్రయల్ పద్ధతిలో ఆరు నెలల పాటు చెన్నైలో ఈ బోర్డు ఏర్పాటు కానుంది. అది విజయవంతం అయితే పూర్తి స్థాయిలో హిందీ డబ్బింగ్ సినిమాల కోసం అక్కడ బోర్డు ఏర్పాటవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా లోకల్ డబ్బింగ్ సెన్సార్ బోర్డులు పెడతారు. దీని వల్ల ఇక హిందీ డబ్బింగ్ వెర్షన్ల కోసం ముంబయికి వెళ్లి లాబీయింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
This post was last modified on October 21, 2023 4:41 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…