ఆరెక్స్ 100 డెబ్యూతోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతికి ఆ తర్వాత మల్టీ స్టారర్ మహా సముద్రం ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా కంటెంట్ నే నమ్ముకుని మంగళవారంతో వస్తున్నాడు. పోస్టర్లతో మొదలుపెట్టి టీజర్ దాకా ప్రేక్షకుల్లో ఒకరకమైన విభిన్న ఆసక్తి రేపిన ఈ క్రైమ్ కం హారర్ థ్రిల్లర్ లో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించడంతో ఈ కాంబో మీద ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 17న ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న మంగళవారం ట్రైలర్ ని చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేయించారు.
అదో చిన్న గ్రామం. అనూహ్యంగా ప్రతి మంగళవారం అక్కడ చావులు మొదలవుతాయి. అవి మాములుగా ఉండవు. భయానకంగా ఉరి పోసుకుని కొందరు, బావిలో శవంగా తేలి ఇంకొందరు ఇలా అంతుచిక్కని రీతిలో ప్రాణాలు కోల్పోతారు. ఊరి పెద్దలతో మొదలుకుని పోలీస్ ఆఫీసర్ల దాకా ఎవరికీ ఏం జరుగుతుందో అంతు చిక్కదు. మరోవైపు ఓ అందమైన అమ్మాయి(పాయల్ రాజ్ పుత్) కోరుకున్నవాడి వ్యామోహంలో పడి సర్వం సమర్పించుకుంటుంది. అసలు ఈ రెండు ఘటనలకు ఉన్న లింక్ ఏంటి. ఇంత పెద్ద మిస్టరీ వెనుక రహస్యాన్ని ఎవరు ఛేదించారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి
దర్శకుడు అజయ్ భూపతి చాలా ఇంటెన్స్ విజువల్స్ ని చూపించాడు. కథను ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతూ థ్రిల్, హారర్ రెండూ సమన స్థాయిలో మిక్స్ చేసి భయపెట్టిన అభిప్రాయం కలిగించాడు. ఆర్టిస్టులు బోలెడున్నారు. నందిత శ్వేతా, దివ్య, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణచైతన్య, అజయ్ ఘోష్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ అందరికీ విలక్షమైన పాత్రలే దక్కాయి. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. శివేంద్ర దాశరధి సంగీతం సమకూర్చారు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ కంటెంట్ తో ఆకట్టుకునేలా ఉన్న మంగళవారం అంచనాలైతే పెంచేసింది.
This post was last modified on October 21, 2023 1:55 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…