విజయదశమి పండగకు ఇంకా టైం ఉండగానే టాలీవుడ్ బాక్సాఫీస్ కు కాస్త ముందుగా సందడి వస్తోంది. ఈసారి పోటీ చాలా ఆసక్తికరంగా మారడంతో థియేటర్లు కళకళలాడతాయని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. రేసులో ఉన్న వాటి బలాలు బలహీనతలు ఏంటో చూద్దాం. ముందుగా భగవంత్ కేసరి విషయానికి వస్తే యాక్షన్ తో సమానంగా ఎమోషన్ కి పెద్ద పీఠ వేసి కాస్త పెద్ద వయసు పాత్రలో బాలయ్యని దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోవడం ఆడియన్స్ లో అంచనాలు రేపింది. ముఖ్యంగా ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా హైప్ అమాంతం పెరగడం సోషల్ మీడియా ట్రెండ్స్ లో గమనించవచ్చు.
బాలకృష్ణ శ్రీలీల మధ్య బాండింగ్ ని హత్తుకునేలా ప్రమోట్ చేయడం, అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఉంటాయనే భరోసా ఇవ్వడం ఓపెనింగ్స్ కి పెద్ద ఎత్తున తోడ్పడనుంది. అయితే కేవలం నాలుగు పాటలు అందులోనూ ఒకటి వారం తర్వాత జోడించే రీమిక్స్ కావడం కొంత మేర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అర్జున్ రాంపాల్ కార్పొరేట్ విలనిజం కొంత రెగ్యులర్ సెటప్ లోనే కనిపిస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ రేంజ్ లో ఉంటే మాత్రం థియేటర్లలో పూనకాలు ఖాయం. ఇక టైగర్ నాగేశ్వరరావులో రవితేజ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. మొదటిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు.
ఇప్పటి తరానికి అవగాహన లేని స్టువర్ట్ పురం దొంగ కథను దర్శకుడు వంశీ చాలా గ్రాండియర్ గా తెరకెక్కించడం, ప్యాన్ ఇండియా మూవీకి కావాల్సిన లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపించడం సానుకూలంశాలు. అయితే జివి ప్రకాష్ పాటలు జనంలోకి అంతగా వెళ్ళలేదు. ప్రమోషన్ పరంగా నార్త్ ఇండియా వైపు ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇక్కడ హైప్ కాస్త తగ్గింది. చేతిలో ఉన్న అయిదు రోజుల్లో స్పీడ్ పెంచాల్సిందే. ఇక లియో సంగతి చూస్తే డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ లోకేష్ కనగరాజ్ బ్రాండ్, గత కొన్నేళ్లలో విజయ్ కు పెరిగిన ఇమేజ్, సితార సంస్థ డిస్ట్రిబ్యూషన్ భారీ విడుదల వచ్చేలా చేస్తున్నాయి.
ట్రైలర్ మీద నెగటివ్ టాక్ వచ్చినా సోషల్ మీడియా హైప్, చరణ్ క్యామియో ఉందనే ఉత్తుత్తి ప్రచారం బజ్ ని పెంచాయి. సో ఈ త్రిముఖ పోటీ చాలా ఆసక్తికరంగా ఉండనున్నది వాస్తవం. వీటితో పాటు గణపథ్ కూడా ఉంది కానీ టైగర్ శ్రోఫ్ కు సౌత్ లో పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే మల్టీప్లెక్సుల పరంగా కొంత స్క్రీన్ కౌంట్ తీసుకుంటాడు. ఫైనల్ గా మాట్లాడేది గెలిపించేది కంటెంటే అయినా తమకంటూ బలాలు బలహీనతలు ఉండే ఈ ట్రయాంగిల్ వార్ లో గెలుపెవరిదో చూడాలంటే శుక్రవారం దాకా వేచి చూడాలి.
This post was last modified on October 15, 2023 2:23 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…