తెలుగులో తన మార్కెట్ బాగా దెబ్బ తినడం, తన కొత్త చిత్రం ‘చిన్నా’కు థియేటర్లు ఇవ్వకపోవడం గురించి ఈ సినిమా ప్రెస్ మీట్లో చాలా ఫీలయ్యాడు తమిళ హీరో సిద్దార్థ్. ఒకప్పుడు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి చిత్రాలతో అతను చూసిన వైభవం వేరు. అలాంటి హీరోకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ సినీ రంగంలో సక్సెస్ సాధించడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం.
తరుణ్, ఉదయ్ కిరణ్.. ఇలా చాలామంది హీరోలు మొదట్లో రైజ్ అయి తర్వాత కింద పడ్డ వాళ్లే. సిద్ధు కూడా ఆ కోవకు చెందిన వాడే. ఇక ‘చిన్నా’ గురించి చెబుతూ.. ఈ సినిమా చూశాక ఇది బాలేదు, సిద్ధును చూసేందుకు థియేటర్లకు రాము అని ప్రేక్షకులు చెబితే.. మళ్లీ తాను హైదరాబాద్‌కే రానని ఎమోషనల్‌గా, పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు సిద్ధు.
అతను అంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటే ‘చిన్నా’లో ఏదో ఒక ప్రత్యేకత ఉందని అర్థమవుతంది. నిజానికి ‘చిన్నా’ చాలా మంచి సినిమా. ఇంకా చెప్పాలంటే గొప్ప సినిమా. పిల్లల మీద లైంగిక వేధింపుల నేపథ్యంలో చాలా ఇంటెన్స్‌గా ఈ సినిమా తీశారు. అదే సమయంలో థ్రిల్లర్ అంశాలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది కూడా. తమిళంలో ‘చిత్తా’ పేరుతో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో ఇంకో అరడజను సినిమాలతో పోటీ పడటం వల్ల ‘చిన్నా’ ప్రేక్షకుల దృష్టిలో పడలేదు.
సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు. చూసిన వాళ్లు బాగుందన్నప్పటికీ.. ఇదేదో డార్క్ మూవీ అన్నట్లుగా జనం దూరంగా ఉన్నారు. దీంతో ‘చిన్నా’ బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపలేదు. గత సినిమాలతో మరీ నిరాశపరచడం కూడా సిద్ధును మన ఆడియన్స్ నమ్మకపోవడానికి ఒక కారణం కావచ్చు. ఈ సినిమాను పట్టించుకోకపోవడం సిద్ధును ఆవేదనకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. దీన్ని మనసుకు తీసుకున్నాడంటే.. రిలీజ్‌కు ముందు అన్నట్లే ఇక ఇటు వైపు రాకుండా ఆగిపోతాడేమో.
This post was last modified on October 14, 2023 7:22 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…