చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్తరాంధ్రలోని ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈయన గురించిన టాపిక్ పెద్దగానే సాగుతోంది. యువతను తనవైపు తిప్పుకోవడంలో బాగానే పనిచేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు.. వైసీపీ నాయకులతోనూ కలివిడిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి చిరంజీవి పోటీ చేయడం ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. వైసీపీ పరంగా దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. వాస్తవానికి 2024లోనే సీతారాం.. తన తనయుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జగన్ ఆ మేరకు అవకాశం ఇవ్వలేదు. కానీ.. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభావంతో వైసీపీ 11కు పరిమితం అయింది.
ఇక, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన కుమారుడిని నిలబెట్టాలన్నది సీతారాం ఆలోచనేకాదు.. నిర్ణయం కూడా. దీంతో వైసీపీ అధినేతను తాను ఒప్పించుకుంటానని గతంలోనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో కుమారుడి పాత్రను మరింత పెంచుతున్నారు. పార్టీ కార్యక్రమాలను చిరంజీవే నిర్వహిస్తున్నారు. పీపీపీ విధానంలో వైద్య శాలలను నిర్మించే విషయంపై జరిగిన నిరసనలోనూ ఆయన పాల్గొన్నారు.
పార్టీ తరఫున కార్యక్రమాల్లోనూ చిరంజీవి పాల్గొంటున్నారు. దీనికితోడు యువతను ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. చిత్రం ఏంటంటే.. తనకు వరసకు బంధువయ్యే.. ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై మాత్రం.. చిరంజీవిపై కూన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
అంతా సైలెంట్‌గా సాగిపోతోంది. కొన్నాళ్ల కిందట వివాదంగామారిన కూన ఆడియో టేపు వ్యవహారం వెనుక చిరు ఉన్నారన్నది కూన వర్గం చెబుతున్న మాట. అంతకుమించి.. ఇరువురు కూడా బహిరంగ విమర్శలు చేసుకోవడం లేదు. కానీ, సైలెంట్‌గా చిరు పుంజుకుంటున్నారు. మరి ఆయన సక్సెస్ అవుతారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on March 4, 2026 3:42 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…