Movie News

విజయ్ ఫ్యాన్స్ బాధ తీరిపోయింది

కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కొత్త సినిమా ‘లియో’పై తమిళనాట హైప్ మామూలుగా లేదు. ఈ చిత్రం రాజకీయంగా కూడా కొంత వేడి పుట్టించింది. భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఆడియో వేడుక రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. అభిమానులను నియంత్రించలేకే ఈ వేడుకను రద్దు చేసినట్లు నిర్మాత ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటం వల్లే దీనికి బ్రేక్ పడిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు ‘లియో’కు తెల్లవారు జాము నుంచే స్పెషల్ షోలు వేయాలని చూస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం కూడా చర్చనీయాంశం అయింది. త్వరలో విజయ్ రాజకీయాల్లోకి రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో అతడి సినిమాకు అడ్డంకులు సృష్టించే ఉద్దేశంతోనే స్టాలిన్ సర్కారు వాటికి అనుమతులు ఇవ్వట్లేదని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో.

విజయ్ సినిమా రిలీజవుతుంటే ఉదయం 9 గంటలకు షో చూడటమేంటి అని వారిలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ‘లియో’ స్పెషల్ షోలకు ఇప్పుడు అనుమతులు వచ్చేశాయి. ‘లియో’ టీం గవర్నరుకు కూడా లేఖ రాసిందని, ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసిందని.. దీంతో స్పెషల్ షోలకు అనుమతులు వచ్చాయని అంటున్నారు.

ఎలా సాధిస్తేనేం.. స్పెషల్ షోలకు అనుమతులు అయితే వచ్చేశాయి. తెల్లవారుజామున 4 గంటలకే షోలు పడిపోతున్నాయి. దీంతో విజయ్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. స్పెషల్ షోల వల్ల ఓపెనింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వస్తాయని భావిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ‘జైలర్’ వసూళ్లను కూడా ఇది దాటేస్తుందని విజయ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 12, 2023 8:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

6 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

6 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

8 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

8 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

10 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

11 hours ago