అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. సలార్ ఈపాటి థియేటర్లలో ఆడుతుండాల్సింది. క్రిస్మస్ సీజన్లో సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా సినిమాలు రిలీజ్ కావాల్సింది. కానీ సలార్ సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడటం.. క్రిస్మస్ కానుకగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త ప్రకటన రావడంతో అంతా గందరగోళంగా తయారైంది. క్రిస్మస్ సినిమాలన్నీ కొత్త డేట్లు చూసుకోక తప్పలేదు.
వాటిలో సైంధవ్ సంక్రాంతికి ఫిక్సయింది. ఎక్స్‌ట్రా డిసెంబరు 8న రిలీజ్ కాబోతున్నట్లు కొత్త డేట్ ఇచ్చారు. ఇక తేలాల్సింది నాని సినిమా విషయమే. కానీ రకరకాల ఆప్షన్లు చూస్తూ టీం ఇంకా డేట్ ఇవ్వలేదు. ఆ చిత్ర బృందం ఎక్కువగా పరిశీలించిన డేట్ డిసెంబరు 8. కానీ ఆ డేట్‌కు ఇప్పుడు పోటీ తీవ్రంగా మారింది. ఆల్రెడీ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబరు రెండో వారంలోనే రాబోతోంది.
ఇక విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని కూడా ఆ వీకెండ్‌కే ఫిక్స్ చేశారు. తాజాగా నితిన్ మూవీ కూడా ఆ వారాంతపు రేసులోకే వచ్చింది. మూడు సినిమాలకు మించి అక్కడ స్పేస్ లేనట్లే. మరి నాని సినిమా పరిస్థితి ఏంటన్నదే తెలియట్లేదు. డిసెంబరు మూడో వారంలో కెప్టెన్ మిల్లర్ వస్తోంది. పైగా క్రిస్మస్ వీకెండ్ ముందు రావడం అంత మంచిది కాదు.
అలా అని క్రిస్మస్‌కు, సంక్రాంతికి మధ్యలో వచ్చినా ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టమే. ఇవేవీ కాదనుకుంటే వేసవే శరణ్యం. అది మరీ ఆలస్యం అయిపోతుంది. అందుకే డిసెంబరు రెండో వారం మీదే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న ఆ వారాంతానికే ఫిక్సయితే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డేట్ మారొచ్చని అంటున్నారు. లేదంటే మాత్రం నాలుగు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది.
This post was last modified on October 9, 2023 10:42 pm
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్క చూపులు చూస్తున్నారా? పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే..…
ఏపీ సీఎం చంద్రబాబు.. అనూహ్యంగా ఢిల్లీ బాట పట్టారు. గురువారం అర్ధరాత్రి ఆయన ఢిల్లీలో దిగిపోయారు. ఈ అనూహ్య పర్యటన…
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…