తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం. ఏ భాషా చిత్రాన్నయినా ఆదరిస్తారు. కొంచెం టాక్ వస్తే చాలు.. వెతుక్కుని వెతుక్కుని మరీ చూస్తారు. అనువాద చిత్రాలు తెలుగులో ఆడినంతగా ఇండియాలో మరే భాషలోనూ ఆడవు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా తెలుగులో ఇక్కడి పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రాలు బోలెడు ఉన్నాయి. ఊరూ పేరు లేని హీరోలు నటించిన సినిమాలు కూడా ఇక్కడ గొప్పగా ఆదరణ పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఐతే మన సినిమాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగినా.. ఇతర భాషల్లో రిలీజ్ చేసిన అన్ని సినిమాలూ ఏమీ ఆడేయవు. ముఖ్యంగా తమిళనాట బాగా ఆడిన తెలుగు చిత్రాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసినా.. అక్కడ థియేటర్లు దక్కడం, సరైన రిలీజ్ లభించడం కష్టమే. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి కొన్ని చిత్రాలకే తమిళ పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది.
ఈ దసరాకు తెలుగు నుంచి ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా మూవీ వస్తోంది. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ చిత్రానికి తమిళనాట ఓ మోస్తరుగా కూడా థియేటర్లు దక్కే పరిస్థితి లేదు. హిందీలో ఈ చిత్రానికి మంచి సపోర్ట్ లభిస్తోంది. అక్కడ థియేటర్లు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. కానీ తమిళ రిలీజ్ మాత్రం కష్టంగా మారిందట.
అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పేరున్న సంస్థల సపోర్ట్ దక్కలేదు. అలాగే థియేటర్ల సమస్య కూడా పెద్దగానే కనిపిస్తోంది. విజయ్ చిత్రం ‘లియో’తోనే థియేటర్లన్నింటినీ నింపేస్తున్నారు. అదే సమయంలో ‘లియో’కు తెలుగులో మంచి రిలీజ్ దక్కుతోంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద సినిమాలు ఉండగానే.. లియోకు చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు ఇస్తున్నారు. కానీ మన వాళ్లు ‘లియో’కు సపోర్ట్ ఇచ్చినట్లు ‘టైగర్’కు తమిళంలో మాత్రం మద్దతు దొరకట్లేదు. అక్కడ ఈ చిత్రం నామమాత్రంగా రిలీజ్ కాబోతోంది.
This post was last modified on October 8, 2023 11:15 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…