బొమ్మరిల్లు సిద్దార్థ్ ఎంతో ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకున్న సినిమా చిన్నా. ఇలాంటి మంచి చిత్రం తన జీవితంలో తీయలేదని పదే పదే చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భావోద్వేగానికి గురవ్వడం అభిమానులను కదిలించింది. అయితే శుక్రవారం నెలకొన్న విపరీతమైన పోటీ వల్ల చిన్నాకు సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. తమిళంలో ఒక వారం ముందే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక్కడ మెల్లగా పికప్ అవుతుందనే అంచనాలతో నిర్మాతలున్నారు. మరి ఇలాంటి వాతావరణంలో వచ్చిన చిన్నా చెప్పుకున్నంత రేంజ్ లో ఉన్నాడా లేదానేది చూద్దాం.
మునిసిపల్ ఆఫీస్ లో పని చేసే ఈశ్వర్(సిద్దార్థ్)కు అన్న కూతురు చిట్టి(సహస్ర శ్రీ)అంటే ప్రాణం. ఆ పాప స్నేహితురాలు మున్ని(సబియా తస్నీమ్)ని సైతం అంతే అభిమానంగా చూస్తుంటాడు. ఓసారి మున్ని మీద లైంగిక దాడి జరిగి ఆ నేరం కాస్త ఈశ్వర్ మీదకు వస్తుంది. ప్రియురాలు(నిమిషా నజయన్)కూడా అపార్థం చేసుకుంటుంది. బెయిలు మీద బయటికి వచ్చాక చిట్టి కనిపించకుండా పోతుంది. దీంతో వెర్రెత్తిపోయిన ఈశ్వర్ పోలీసుల మీద ఆధారపడకుండా తనే స్వయంగా వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
చాలా సెన్సిటివ్ పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అరుణ్ కుమార్ అంతే సున్నితంగా కథనం ఎలాంటి పక్కదారి పట్టకుండా చిన్నాని రూపొందించాడు. ఇంట్లో చిన్న పిల్లలున్న తల్లితండ్రులకు బలంగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో హంతకుడిని పట్టుకునే వైనం, చివరి ట్విస్టు మనం ఎంతో గొప్పగా ఆశిస్తాం కానీ అంత స్థాయిలో లేవు. అయినా సరే ఇప్పటి సమాజానికి కావాల్సిన ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. కాకపోతే ఇలాంటి హార్డ్ హిట్టింగ్ డ్రామాలు తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయినంతగా తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్ అవుతాయనే దాన్ని బట్టే సక్సెస్ ఫెయిల్యూర్ ఆధారపడి ఉంది.
This post was last modified on October 6, 2023 10:41 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…