వెంకటేష్ సైంధవ్ ని సంక్రాంతి విడుదలని ప్రకటించాక నాగార్జున ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారు. నా సామి రంగా డేట్ చెప్పలేదు కానీ పండగకు రావడం ఖాయమని ఆ మధ్య టీజర్ లోనే చెప్పేశారు కాబట్టి డౌట్ ఏం లేదు. కాకపోతే పోటీ మరీ విపరీతంగా అయిపోవడంతో అంత రిస్క్ చేయడం అవసరమానే కోణంలో ఆలోచించే అవకాశం లేకపోలేదు. అన్నిటిలోకి రీమేక్ ఇదొక్కటే కావడం రిస్క్ పరంగా క్యాలికులేట్ చేసుకోవాలి. అయితే వెంకీ, నాగ్ అభిమానులు పరస్పరం ఆన్ లైన్ వేదికగా కవ్వించుకోవడం మొదలుపెట్టారు. అవసరం లేని సవాళ్లు చేసుకుని రెచ్చగొట్టుకుంటున్నారు.
నిజానికి ఈ ఇద్దరి క్లాష్ జరిగిన సందర్భాలు తక్కువ. అందరికీ ఎక్కువగా గుర్తున్నది మాత్రం 1992. చంటి, కిల్లర్ జనవరి 10న ఒకే రోజు తలపడ్డాయి. వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొడితే కిల్లర్ ఎబోవ్ యావరేజ్ కు హిట్ కు మధ్యలో ఆగిపోయింది. ఆ రకంగా విక్టరీ పైచేయి సాధించారు. 1996లో వారం గ్యాప్ తో ధర్మచక్రం, వజ్రం ఫేస్ టు ఫేస్ ఎదురయ్యాయి. అప్పుడూ దగ్గుబాటిదే డామినేషన్. మొదటి సందర్భంలో చంటి రీమేక్ అయితే రెండో సిచువేషన్ లో వజ్రం రీమేక్ కావడం విశేషం. తాజాగా సైంధవ్ స్ట్రెయిట్ సబ్జెక్టు కాగా నా సామీ రంగా అసలు మూలం మళయాలం మూవీ
ఇదే కాదు 1989లో ప్రేమ వర్సెస్ విజయ్ కేసులోనూ ఫలితం ఇలాగే వచ్చింది. 1996 అక్టోబర్ లో రెండు వారాల వ్యవధిలో నిన్నే పెళ్లాడతా, పవిత్ర బంధం విడుదలైతే ఒకటి బ్లాక్ బస్టర్ కాగా మరొకటి సూపర్ హిట్ అందుకుంది. 2013 ఏప్రిల్ లో షాడో, గ్రీకు వీరుడు ఎదురుపడితే ఇద్దరూ ఫ్లాపులు అందుకోవడం ఫైనల్ ట్విస్టు. మాములుగా చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య జరిగే ఇలాంటి వార్ ఇప్పుడు వెంకీ, నాగ్ లకు షిఫ్ట్ కావడం విచిత్రం. ఇంకా డేట్లు ఖరారు చేసుకోని వాటిలో విజయ్ దేవరకొండ 13, నా సామి రంగా మాత్రమే బాలన్స్ ఉన్నాయి. వీలైనంత త్వరగా చెప్పేస్తే బెటర్.