ఒక్కో దర్శకుడికి ఒక్కో హీరోయిన్ మీద బాగా గురి కుదురుతుంది. అలా కుదిరిన వాళ్లతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యేక అభిమానం చూపించే హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా పూజా హెగ్డే పేరు చెప్పేయొచ్చు.
ఒక లైలా కోసం, ముకుంద లాంటి మీడియం రేంజి సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయిన పూజాను ఏరి కోరి ఎంచుకుని ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కథానాయికను చేసి తన కెరీర్‌ను మలుపు తిప్పింది హరీషే.
ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా పూజ కెరీర్‌కు మాత్రం ఢోకా లేకపోయింది. వరుసగా పెద్ద స్టార్ల సరసన భారీ చిత్రాలతో దూసుకెళ్లింది. ఇప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ పూజానే అనే విషయంలో మరో మాట లేదు.
ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌తో నటించిన పూజా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఆమెను పవన్ పక్కన నటింపజేస్తున్నది హరీషే కావడం విశేషం. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా చేస్తున్న పవన్.. దీని తర్వాత హరీష్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ఇప్పటికే కథ కూడా రెడీ చేశాడు హరీష్. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘డీజే’ తర్వాత హరీష్ నటించిన ‘గద్దలకొండ గణేష్’లోనూ పూజా ప్రత్యేక పాత్రలో నటించింది. ఇప్పుడు పవన్ సినిమాకు కూడా ఆమెనే కథానాయికగా ఎంచుకుని హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడట హరీష్.
తన కెరీర్‌ను మలుపు తిప్పిన హరీష్ శంకర్ డైరెక్షన్, పైగా పవన్ కళ్యాణ్ హీరో అంటే ఈ అవకాశాన్ని పూజా ఎందుకు వదులుకుంటుంది? ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 25, 2020 1:44 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…