సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 అధికారిక ప్రకటన వచ్చాక ఒక్కసారిగా మిగిలిన హీరోలు నిర్మాతలు అలెర్టయిపోయారు. క్లాష్ కాకుండా ఎంత గ్యాప్ ఉండాలో పక్కా ప్లానింగ్ చేసుకునే పనిలో ఉన్నారు. న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్నని ముందుకు జరిపి డిసెంబర్ 7 విడుదల చేయాలనే ఆలోచన సీరియస్ గా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. అదే రోజు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి వస్తునప్పటికీ అన్ని సంబంధం లేని జానర్లు కావడంతో పోటీ పడేందుకు సై అనుకున్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ చర్చయితే జరుగుతోంది.
ఒకవేళ ఫిక్స్ అయినా హాయ్ నాన్నకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే సలార్ వచ్చాక థియేటర్లు దానికి వెళ్లిపోతాయి. బాలన్స్ ఉన్నవి షారుఖ్ ఖాన్ డుంకీ, బాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డంకి పంచేస్తారు. సో ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే నాని సినిమాని కొనసాగించడం కష్టం. ఇది ప్రొడ్యూసర్లకూ తెలుసు. అయితే ఇలాంటి ఎమోషనల్ ఎంటర్ టైనర్లు హిట్టవడానికి ఆ మాత్రం సమయం సరిపోతుందని, దసరా పది రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిన సంగతి గుర్తు చేసుకుని ఆ మేరకు డిసెంబర్ మొదటి వారమే సేఫనే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి.
ఒక రకంగా చూస్తే ఇది మంచి ఎత్తుగడే. క్రిస్మస్ అడ్వాంటేజ్ పోగొట్టుకుంటున్నప్పటికీ ఒకవేళ డిసెంబర్ వద్దనుకుంటే ఏకంగా జనవరిలో కూడా సాధ్యం కాదు. సంక్రాంతి ఆల్రెడీ ప్యాకైపోయింది. పోనీ ఫిబ్రవరి అనుకుంటే చాలా ఆలస్యమవుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన హాయ్ నాన్న అక్టోబర్ చివరి లోపే గుమ్మడికాయ లాంఛనం పూర్తి చేసుకుంటుంది. ఆపై నెల రోజులు ప్రమోషన్లు, ఈవెంట్లు, ట్రైలర్ లాంచులు, ప్యాన్ ఇండియా టూర్లు బోలెడు చూసుకోవచ్చు. సో హాయ్ నాన్న నిర్ణయం అతి త్వరలో హఠాత్తుగా వెలువడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on September 29, 2023 4:51 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…