అన్ని రకాల దుకాణాలూ తెరుచుకున్నాయి. వైన్ షాపులూ ఓపెనయ్యాయి. జిమ్‌లు కూడా తెరిచేశారు. ఏ షరతులూ లేకుండా అన్నీ మామూలుగా నడుస్తున్నాయి. కానీ థియేటర్లకు మాత్రం మోక్షం కలగలేదు.
ఐదు నెలలకు పైగా దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. థియేటర్ల తాళాలు తెరుచుకోవట్లేదు. లాక్ డౌన్ 3.0లో అయినా థియేటర్లకు మోక్షం కల్పిస్తారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
షూటింగ్‌లకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్లు ఓపెన్ చేసే విషయం మాత్రం తేల్చలేదు. కానీ షూటింగ్‌ల దగ్గర పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ప్రస్తావిస్తూ.. థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్‌తో సీటింగ్ ఏర్పాటు చేయడం, టికెట్లను ఆన్ లైన్లో మాత్రమే అమ్మడం గురించి సూచనలు చేయడం గమనార్హం.
థియేటర్లకు అనుమతి ఇవ్వకపోవడంపై వాటిని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరీ ఆందోళన అక్కర్లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. సెప్టెంబరు మధ్య లోపే థియేటర్లు తెరుచుకోబోతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
థియేటర్లు ఎలా నిర్వహించాలో యాజమాన్యాలకు సంకేతాలు ఇస్తూ పై మార్గదర్శకాలు ఇచ్చారని.. మరిన్ని సూచనలతో వారికి ముందే ఒక నోట్ వెళ్లబోతోందని.. అంతా ఓకే అనుకున్నాక థియేటర్లను ఓపెన్ చేస్తారని అంటున్నారు. ఈ దిశగా మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఇప్పటికే థియేటర్లను సిద్ధం చేసే పనిలో పడ్డాయని.. సెప్టెంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు తెరుచుకుంటాయని.. దసరాకు కొత్త సినిమాల సందడి చూడొచ్చని.. కాకపోతే అనేక షరతుల మధ్య సినిమాల ప్రదర్శన సాగుతుందని.. పూర్తి ఆక్యుపెన్సీ మాత్రం వ్యాక్సిన్ రాకుండా సాధ్యం కాదని అంటున్నారు.
This post was last modified on August 24, 2020 5:10 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…