చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న లియో ఆడియో ఫంక్షన్ రద్దు కావడం పట్ల కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. నిర్మాణ సంస్థ దీనికి సంబంధించి వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూటా డెబ్భై సినిమాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ కు రాని సమస్య విజయ్ కు మాత్రమే ఎందుకు ఊహిస్తున్నారని నిలదీస్తున్నారు. కేరళలో చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం భయపడుతున్నారు. అయితే పైకి కనిపించినంత తేలిగ్గా ఈ వ్యవహారం లేదని చెన్నై వర్గాల కథనం.
కొంచెం డీటెయిల్స్ లోకి వెళదాం. లియో వేడుక కోసం ఎంపిక చేసిన చెన్నై జవహర్ లాల్ నెహ్రు స్టేడియం కెపాసిటీ 8000. స్టేజి నిర్మించాక అది 6000కు తగ్గిపోతుంది. పది శాతం సీట్లు సదరు గ్రౌండ్ యాజమాన్యంకు ఇవ్వాలి. అది ఒప్పందంలో ముందే రాసుకుంటారు. అంటే నిర్వాహకులకు మిగిలేవి 5400 సీట్లు మాత్రమే. నిర్మాత తనకు కనీసం 3000 టికెట్లు కావాలని ముందే చెప్పేశాడు. స్పాన్సర్లు, బిజినెస్ పార్ట్నర్ల కోసం. అయితే విజయ్ మక్కల్ ఇయక్కం జనరల్ సెక్రటరీ అయిన బుస్సీ ఆనంద్ ఫ్యాన్ అసోసియేషన్ల కోసం 4000 టికెట్లు ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేశాడు.
దీంతో ఏకాభిప్రాయం రాకపోవడంతో మొత్తానికి క్యాన్సిల్ చేశారు. ఈలోగా తెలిసిన మరో ట్విస్టు ఏంటంటే ఒరిజినల్ ని తలదన్నేలా ఉన్న నకిలీ టికెట్లు సుమారు 10 వేలకు పైగా మార్కెట్ లో చెలామణిలోకి వచ్చేశాయి. వీటిని భారీ రేట్లకు అమ్ముకున్నారు కూడా. ఒకవేళ ఫంక్షన్ నిర్వహిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని గ్రహించి వెంటనే రద్దు చేసేశారు. ఇటీవలే ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదట. అయినా లక్షలాది ఫ్యాన్స్ తో ఎన్నో తెలుగు ఫంక్షన్లు పబ్లిక్ గ్రౌండ్స్ లో గొప్పగా జరిగాయి. జస్ట్ వేల మందికే ఇంత ఇదై పోవడం విచిత్రమే.
This post was last modified on September 27, 2023 8:12 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…