గ్లామర్ షోకి దూరంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఏరికోరి మరీ ఎంచుకునే టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్య మీనన్ ముందు వరసలో ఉంటుంది. స్వప్న సినిమా భాగస్వామ్యంలో తను నటించిన కొత్త వెబ్ సిరీస్ శ్రీమతి కుమారి ఈ శుక్రవారం నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి మీద నిన్నటి నుంచి ఒక వింత ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక తమిళ హీరో తనను విపరీతంగా వేధించాడని, దాని వల్ల మానసికంగా చాలా క్షోభకు గురి కావాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వచ్చిన వార్త బాగా వైరల్ అయ్యింది.
కామెడీ ఏంటంటే నిత్య మీనన్ అసలలా ఎవరితోనూ అనలేదట. అయినా పేరు చెప్పకుండా ఎవరో వేధించారని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తనకూ తెలుసు. కొన్నేళ్ల క్రితం పలువురు బాలీవుడ్ కోలీవుడ్ హీరోయిన్లు పేర్లు చెప్పి మరీ మీ టూ ఉద్యమం లేవనెత్తితే తర్వాత దాని గురించి పట్టించుకున్న నాథుడు లేడు. ఇండస్ట్రీ పోకడ అలా ఉంది. పోనీ ఎవరైనా బలమైన సాక్ష్యాధారాలు చూపిస్తారా అంటే అదీ ఉండదు. అలాంటప్పుడు ఇలా చెప్పుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇదంతా తెలియనంత అనుభవలేమి నిత్య మీనన్ కి లేక కాదు.
కుమారి శ్రీమతి ప్రమోషన్లలో భాగంగా దానికి హైప్ రావడం కోసం ఇలా చేశారన్న కామెంట్స్ లేకపోలేదు కానీ ఇదంతా వట్టి సోషల్ మీడియా ఫార్స్ వ్యవహారంలాగే చూడాలి. ఆ మధ్య భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన జోడి కట్టిన నిత్య మీనన్ సహజంగా ఉండే తన బొద్దుతనానికి స్వస్తి చెప్పి ఇప్పుడు చక్కని రూపంలో ఉంది. అయినా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా రావడం లేదు కానీ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలు వస్తే మాత్రం నో చెప్పడం లేదు. స్వంత ఇంటి కోసం మద్యం షాపు పెట్టేందుకు వెనుకాడని యువతిగా శ్రీమతి కుమారిలో నిత్య మీనన్ చాలా డిఫరెంట్ గా కనిపించనుందట.
This post was last modified on September 26, 2023 11:24 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…