నిన్న సాయంత్రం నుంచి ఇండియన్ సోషల్ మీడియా అంతటా ప్రధాన చర్చ ఈ ఏడాది క్రిస్మస్‌కు జరగబోయే బాక్సాఫీస్ వార్ గురించే. ఆ సీజన్‌కు ఆల్రెడీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా ‘డుంకి’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రెండేళ్ల ముందే ఈ మేరకు ప్రకటన వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ప్రభాస్ సినిమా ‘సలార్’ను క్రిస్మస్‌కు కన్ఫమ్ చేసినట్లుగా అప్‌డేట్ బయటికి వచ్చింది.
ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. డిస్ట్రిబ్యూటర్లకు హోంబలె ఫిలిమ్స్ నుంచి ఈ మేరకు మెయిల్స్ కూడా వచ్చినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఇలాంటి రెండు భారీ చిత్రాలు క్రిస్మస్ సీజన్లో రిలీజైతే అన్ని రకాలుగా ఇబ్బందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెంటికీ సరిపడా స్క్రీన్లు దక్కవు. కలెక్షన్లలో కోత పడుతుంది. ఒక సినిమాకు మంచి టాక్ వచ్చి, రెండో చిత్రానికి డివైడ్ టాక్ వస్తే.. ఆ రెండో చిత్రం దారుణంగా దెబ్బ తింటుంది.
సలార్, డుంకి రెండు చిత్రాల మీదా భారీ బడ్జెట్ పెట్టారు. బాక్సాఫీస్ పొటెన్షియాలిటీ రెంటికీ తిరుగులేని స్థాయిలో ఉంది. అలాంటపుడు సోలోగా రిలీజైతే వీటి ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు భారీగా ఉంటాయి. అలా కాకుండా ఒకదాంతో ఒకటి పోటీ పడితే రెంటికీ నష్టమే. ఇక టాక్ తక్కువగా వచ్చిన సినిమాకు గట్టి దెబ్బ తప్పదు. కాబట్టి ఇండస్ట్రీ వర్గాలు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు పోటీ వద్దే వద్దని అంటున్నారు. ఎప్పుడో రిలీజ్ ఖరారు చేసుకున్న ‘డుంకి’ మీదికి ‘సలార్’ వచ్చి పడటం న్యాయమా అని బాలీవుడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఐతే ట్రేడ్ పండిట్లు చెబుతున్న మాటేంటి అంటే.. ఈ రెండింట్లో ఒకటే క్రిస్మస్‌కు వస్తుందట. ‘డుంకి’ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమయ్యేలా ఉండటంతో అది క్రిస్మస్‌కు వస్తుందనే గ్యారెంటీ లేదని అంటున్నారు. ఈ మేరకు సమాచారం తెలుసుకునే ‘సలార్’ టీం డేట్ ఇచ్చి ఉండొచ్చంటున్నారు. అలా కాకుండా ‘డుంకి’ పక్కాగా క్రిస్మస్‌కు వచ్చేట్లయితే.. ‘సలార్’ డేట్ మార్పించడానికి ప్రయత్నాలు జరుగుతాయని.. లేదంటే ‘డుంకి’కే డేట్ మార్చుకుంటారని.. కాబట్టి రెండూ క్రిస్మస్‌కు రావడం సందేహమే అని అంటున్నారు.
This post was last modified on September 26, 2023 6:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…