నిన్న రాత్రి హఠాత్తుగా సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 ఉంటుందనే ప్రచారం అన్ని బాషా సినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య తన ఇన్సాటా స్టోరీలో బలమైన క్లూ ఇవ్వడంతో ఎవరికి వారు కన్ఫర్మేషన్ ఇచ్చుకుని స్వంతంగా పోస్టర్లు కూడా తయారు చేసుకున్నారు. హోంబాలే ఫిలింస్ మాత్రం తమకు అలవాటైన రీతిలో నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. అయితే ఇప్పుడీ వార్త సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఆన్ లైన్ గొడవలకు దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.
దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మొదటిసారి షారుఖ్ తో తీస్తున్న డుంకీ విడుదల తేదీని షూటింగ్ మొదలైన రోజే ప్రకటించారు. దానికి తగ్గట్టే ఇతర నిర్మాతలు పోటీకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు సలార్ అదే తేదీకి తీసుకోవడం వల్ల సమస్య వచ్చి పడింది. ఒకవేళ డుంకీ వాయిదా పడితే భయపడ్డారనే కామెంట్స్ వస్తాయి. పోనీ తలపడితే పరస్పరం ఓపెనింగ్స్ పరంగా ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఉత్తరాది రాష్ట్రాల్లో షారుఖ్ డామినేషన్ ఉంటే, సౌత్ ప్లస్ ఓవర్సీస్ లో ప్రభాస్ ని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు.
అసలిదంతా పరస్పరం మాట్లాడుకుని ఒక అండర్ స్టాండింగ్ తోటి డేట్లు ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది కానీ అందరికీ ఆందోళన కలిగేలా హఠాత్తుగా ప్రకటనలు ఇవ్వడం కరెక్ట్ కాదనేది బయ్యర్ల వాదన. మాకు పోటీగా వస్తే దెబ్బ తింటారని ప్రభాస్, షారుఖ్ అభిమానులు పరస్పరం కవ్వించుకుంటున్నారు. పఠాన్, జవాన్ లాంటి రొటీన్ మాస్ సినిమాలతోనే వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్లు సాధించిన షారుఖ్ ఖాన్ అపజయమే ఎరుగని రాజ్ కుమార్ హిరానీతో జట్టు కడితే జరిగే బాక్సాఫీస్ అరాచకం ఊహకు సైతం అందదు. రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం.
This post was last modified on September 26, 2023 3:46 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…