ఒక ఆరేళ్ల ముందు వరకు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు మురుగదాస్. రమణ (ఠాగూర్ ఒరిజినల్), గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్లతో తన రేంజే వేరని చాటి చెప్పాడు మురుగదాస్. కథల్లో వైవిధ్యం చూపిస్తూనే బ్లాక్ బస్టర్లు కొట్టడంతో దర్శకుడిగా తనకు గొప్ప పేరొచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ అంతటి వాళ్లు పిలిచి మరీ తనతో సినిమాలు చేశారు. మహేష్ బాబు సైతం మురుగదాస్‌తో సినిమా చేయడానికి ఆశపడ్డాడు.
అలా వీరి కలయికలో వచ్చిన చిత్రమే.. స్పైడర్. ఈ సినిమాతో మురుగ మరో బ్లాక్‌బస్టర్ ఇస్తాడనుకుంటే.. ఆయనతో పాటు మహేష్ కెరీర్లోనూ అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ ఈ సినిమా దెబ్బకు మురుగదాస్ కాన్ఫిడెన్సే దెబ్బ తింది. తర్వాత ఆయన హిట్టే ఇవ్వలేకపోయాడు. ‘సర్కార్’, ‘దర్బార్’ రెండూ కూడా నిరాశపరిచాయి. ‘దర్బార్’ రిలీజై మూడున్నరేళ్లు దాటినా ఇంకా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనే లేదు మురుగదాస్.
మధ్యలో విజయ్‌తో ఓ సినిమాను మొదలుపెట్టినా.. అది ఎందుకో ఆగిపోయింది. కొత్త సినిమాల కబుర్లు చాలా వినిపించాయి కానీ.. ఏదీ కార్యరూపం దాల్చలేదు. అల్లు అర్జున్ కోసం ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. ఐతే ఎట్టకేలకు మురుగదాస్ తన కొత్త సినిమాను కన్ఫమ్ చేసుకున్నాడు. మురుగ గతంలో చేసిన స్థాయిలో టాప్ స్టార్ కాకపోయినా.. ప్రస్తుతం తమిళంలో మంచి స్థాయిలో ఉన్న శివ కార్తికేయన్‌తో మురుగా తన కొత్త చిత్రం చేయబోతున్నాడు.
ఈ రోజు మురుగదాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ.. ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు శివ కార్తికేయన్. మురుగదాస్ నరేషన్‌కు తాను ఫిదా అయిపోయానని.. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను మొదలుపెడదామా అని చూస్తున్నానని శివ కార్తికేయన్ చెప్పాడు. కెరీర్లో ఈ దశలో శివతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు మురుగదాస్ సంతోషించాల్సిందే. ఈ సినిమాతో అయినా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
This post was last modified on September 25, 2023 6:21 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…