చంద్రముఖి-2 సినిమాకు ముందు అనౌన్స్ చేసిన డేట్ సెప్టెంబరు 15. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. ఉన్నట్లుండి టీం షాకిచ్చింది. సినిమాను వాయిదా వేసేసింది. ముందు డేట్ ప్రకటించకపోయినా.. సెప్టెంబరు 28కి ఈ సినిమా ఫిక్సయింది. సలార్ మూవీ వాయిదా పడటంతో సెప్టెంబరు చివరి వీకెండ్ బాగా కలిసొస్తుందన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారనే చర్చ నడిచింది అప్పుడు.
కానీ తమ సినిమా వాయిదా పడటానికి అసలు కారణం వేరు అని దర్శకుడు పి.వాసు వెల్లడించాడు. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా.. పెద్ద సంఖ్యలో వీఎఫ్ఎక్స్ కంటెంట్ కనిపించకుండా పోయిందని.. దీంతో టీం అంతా కంగారు పడిపోయిందని.. ఆ పరిస్థితుల్లోనే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని వాసు వెల్లడించాడు.
సినిమాలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే వీఎఫెక్స్‌కు సంబంధించి 480 షాట్స్ కనిపించకుండా పోయాయని పి.వాసు వెల్లడించాడు. సంబంధిత షాట్స్ కోసం 150 మంది దాకా టెక్నీషియన్స్ పని చేస్తున్నారని.. కొంచెం కొంచెం పంచుకుని వేర్వేరు టీమ్స్ వర్క్ చేస్తున్నాయని.. అలాంటి సమయంలో కీలకమైన షాట్స్ కనిపించడం లేదని అనడంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తిందని వాసు చెప్పాడు.
నాలుగైదు రోజులు ఈ కంటెంట్ వెతికే పని నడిచిందని.. చివరికి ఆ కంటెంట్ మొత్తం రిట్రీవ్ చేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుందని వాసు తెలిపాడు. ఈ కారణంతోనే సినిమా వాయిదా వేశాం తప్ప.. వేరే సినిమాలతో పోటీ, మరో డేట్ అయితే బాగుంటుందనే కారణంతో మాత్రం కాదని చెప్పాడు వాసు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని.. చివరి అరగంటలో ప్రేక్షకులు ఆశ్చప్యపోయేలా సినిమా ఉంఉటందని.. క్లైమాక్స్ హైలైట్ అని వాసు అన్నాడు.