ఒకప్పుడు తమిళంలో పెద్ద పెద్ద హిట్లతో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు విశాల్. అతడి సినిమాలు తెలుగులో కూడా అనువాదమై మంచి ఫలితాన్నందుకున్నాయి. కానీ కొన్నేళ్ల నుంచి విశాల్ రొటీన్ మాస్ మసాలా సినిమాలతో నిరాశ పరుస్తున్నాడు. అతడి సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘లాఠీ’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది.
ఇక విశాల్ పుంజుకోవడం కష్టమే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి టైంలో వచ్చిన చిత్రం.. మార్క్ ఆంటోనీ. ఒక క్రేజీ ట్రైలర్‌తో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలుగులో కూడా ఈ సినిమాకు డీసెంట్ బజ్ కనిపించింది. ఈ వారం సరైన పోటీ లేకపోవడం కూడా ‘మార్క్ ఆంటోనీ’కి కలిసొచ్చింది. ఈ చిత్రానికి టాక్ కొంచెం మిక్స్డ్‌గా వచ్చినప్పటికీ రెండు చోట్లా తొలి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
తమిళంలో అయితే ‘మార్క్ ఆంటోనీ’ సూపర్ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. విశాల్ కెరీర్లోనే అత్యధికంగా ఈ చిత్రానికి రూ.12 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి తొలి రోజు. విశాల్ రేంజికి ఈ వసూళ్లు చాలా ఎక్కువే. తమిళంలో ఈ సినిమాకు రెండో రోజు కూడా వసూళ్లు డ్రాప్ అవ్వలేదు. సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. ఇందులోని ఓవర్ ద టాప్ కామెడీ తమిళ జనాలకు బాగానే నచ్చుతోంది. ఎస్.జె.సూర్య పాత్రకు వాళ్లు బాగా కనెక్ట్ అయిపోయారు. తన కోసమే సినిమాకు వెళ్తున్నారు. శనివారం ఈ చిత్రం ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది. ఆదివారం కూడా మంచి వసూళ్లే వచ్చేలా ఉన్నాయి.
అక్కడ సినిమా సూపర్ హిట్ అయినట్లే కనిపిస్తోంది. కానీ తెలుగులో మాత్రం ‘మార్క్ ఆంటోనీ’ అంత ప్రభావం చూపలేకపోతోంది. తొలి రోజు వసూళ్లు బాగున్నా.. రెండో రోజు డ్రాప్ అయ్యాయి. సినిమాలోని ఓవర్ ద టాప్ సీన్లు.. లౌడ్ నరేషన్ మనవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. కామెడీ కొంత వర్కవుట్ అయినా సరే.. రెండున్నర గంటలు ఈ లౌడ్‌నెస్‌ను మనవాళ్లు భరించలేకపోతున్నారు. దీంతో టాక్ బాగా మిక్స్డ్‌గా వచ్చి వసూళ్ల మీద ప్రభావం పడింది.
This post was last modified on September 17, 2023 5:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…