యశ్ రాజ్ ఫిలిమ్స్. ఇండియాలో అత్యంత సుదీర్ఘ, ఘనమైన చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ సెప్టెంబరు 27న 50వ వార్షికోత్సవం జరుపుకోబోతంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేసారి ఐదు భారీ చిత్రాల్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఈ ఐదు సినిమాలకు కలిపి పెట్టబోతున్న బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లట. ఆసక్తికర కాంబినేషన్లలో.. బాలీవుడ్ టాప్ స్టార్లతో ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేయనుంది యశ్ రాజ్ ఫిలిమ్స్.
యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సహా అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన షారుఖ్ ఖాన్.. కొంత విరామం తర్వాత ‘పఠాన్’ పేరుతో ఆ బేనర్లో సినిమా చేయనున్నాడట. ఇందులో జాన్ అబ్రహాం, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తారట. ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్ర బడ్జెట్ రూ.250 కోట్లట. ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇదే బేనర్లో మనీష్ శర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడట. దాని బడ్జెట్ రూ.350 కోట్లంటున్నారు.
మరో పెద్ద హీరో హృతిక్ రోషన్.. ‘వార్’ తర్వాత మళ్లీ యశ్ రాజ్ బేనర్లో ఓ సినిమా చేయనున్నాడట. దీని బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని సమాచారం. అలాగే అజయ్ దేవగణ్ హీరోగా శివ రవైల్ అనే కొత్త దర్శకుడు యశ్ రాజ్ బేనర్లో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడట. దాని బడ్జెట్ రూ.150 కోట్ల దాకా ఉంటుందట.
అలాగే యువ కథానాయకుడు విక్కీ కౌశల్, అందాల సుందరి మానుషి చిల్లర్ కలయికలో విక్టర్ దర్శకత్వంలో రూ.50 కోట్ల బడ్జెట్లో ఓ సినిమాను యశ్ రాజ్ సంస్థ నిర్మించనుందట. మొత్తంగా ఈ ఐదు సినిమాల బడ్జెట్ రూ.1000 కోట్లు. ఈ ఐదు సినిమాలను ఒకేసారి 50వ వార్షికోత్సవం సందర్భంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించనుందట.
This post was last modified on August 22, 2020 10:10 am
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్ని…