దసరాతో మాస్ అవతారమెత్తి బ్లాక్ బస్టర్ కొట్టాడు నాని. ప్రస్తుతం కొత్త దర్శకుడు శౌర్యువ్ తో ‘hi నాన్న’ సినిమా చేస్తున్నాడు. తాజాగా నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు నాని. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి డైరెక్షన్ లో ఓ ఎంటర్టైనర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. శివ కార్తికేయన్ తో ఈ దర్శకుడు తీసిన డాన్ సినిమా తెలుగులో కూడా హిట్ అనిపించుకుంది. డబ్బింగ్ సినిమాగా వచ్చి మంచి కలెక్షన్స్ సాదించింది.
అందుకే నాని ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. దసరా కి పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి అదే నెలలో రెగ్యులర్ ఘాట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబో సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఈ బేనర్ లో రామ్ తో స్కంద నిర్మించబడింది.
నెక్స్ట్ నాగార్జున తో ‘నా సామి రంగ’ నిర్మించనున్నారు. రెండు సినిమాలను ఒకేసారి నిర్మించేందుకు చూస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించే అవకాశం ఉంది. డాన్ కి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ప్లస్ అయ్యింది. అందుకే దర్శకుడు అతన్నే రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నాని సినిమాలు ‘గ్యాంగ్ లీడర్’ కి అలాగే ‘జెర్సీ’ కి అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడు. మళ్లీ సెట్ అయితే వీరి కాంబోలో ఇది మూడో సినిమా అవుతుంది.
This post was last modified on September 9, 2023 9:51 pm
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…