ఆ సెన్సేషనల్ ఫొటోల వెనుక అసలు కథ

Kasturi

నిన్నటి తరం హీరోయిన్ కస్తూరి గురించి పరిచయం అక్కర్లేదు. ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్ చెల్లెలి పాత్రలో.. ‘అన్నమయ్య’లో నాగార్జున్ సరసన కథానాయికగా ఆమె మంచి పాపులారిటీనే సంపాదించింది. హీరోయిన్‌గానే కాక.. క్యారెక్టర్ రోల్స్‌తో తమిళ, తెలుగు భాషల్లో చాలా సినిమాలే చేసింది కస్తూరి.

సినీ కెరీర్ ముగిశాక పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయిపోయిన కస్తూరి ఈ మధ్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి సీరియళ్లు, సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే కొన్నేళ్ల కిందట ఆమె ఒక ఫొటో షూట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తల్లి పాల మీద అవగాహన పెంచే క్రమంలో ఆమె టాప్ లెస్‌గా బిడ్డకు పాలిస్తున్న ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు ఇంటర్నెట్లో బయటికి రావడం సంచలనం రేపింది.

ఓ ఇండియన్ హీరోయిన్ ఇలాంటి ఫొటో షూట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పైగా కస్తూరి లాంటి హోమ్లీ హీరోయిన్ ఇలా చేయడం మరింత సంచలనమైంది. దీనిపై వివాదం కూడా నడిచింది. దీని గురించి ఇప్పుడు ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడింది కస్తూరి. నిజానికి ఆ ఫొటో షూట్ తాను ఓ ఫారిన్ హెల్త్ మ్యాగజైన్ కోసం చేసిందని.. ఆ సొసైటీలో దీన్ని రిసీవ్ చేసుకునే విధానం వేరుగా ఉంటుందని.. తనకది ఏమాత్రం తప్పుగా అనిపించలేదని కస్తూరి తెలిపింది.

కానీ ఎవరో ఆ ఫొటోలను తమకు తెలియకుండా లీక్ చేసేశారని.. దీంతో ఇంటర్నెట్లో వైరల్ అయిపోయాయని.. అది తనకు ఇబ్బందికర పరిణామమే అని ఆమె అంది. మన వాళ్లు వేరే రకంగా ఆ ఫొటోలను తీసుకున్నారని.. మన సొసైటీలో అలాంటివి జీర్ణించుకోలేరని.. తన మీద విమర్శలు కూడా వచ్చాయని.. తాను చేసింది తప్పు అనిపించిందని కస్తూరి తెలిపింది.