భయపడిందే జరుగుతోంది. మొదటి మూడు రోజుల్లోనే డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఖుషి సోమవారం డ్రాప్ తీవ్రంగా ఉండకూడదని బయ్యర్లు అభిమానులు సంయుక్తంగా కోరుకున్నారు. అయితే వసూళ్లలో సుమారు 80 శాతం దాకా తగ్గుదల నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మండే షేర్ కోటి అందుకోవడమే కష్టమైందని వస్తున్న రిపోర్ట్స్ టెన్షన్ పెట్టేలా ఉన్నాయి. టాక్ డివైడ్ గా వచ్చిందన్న కామెంట్స్ కి బలం చేకూర్చేలా ఫిగర్లు నమోదు కావడం గమనార్హం. ఫ్యామిలీ ఆడియన్స్ అండ బలంగా ఉంటుందని ఆశించిన నేపథ్యంలో ఇలా జరగడం ట్విస్టే.
ఇక్కడ మరో ప్రధాన కారణాన్ని ప్రస్తావించుకోవాలి. చాలా చోట్ల విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ నే తీసుకుంటే అసలు ఇళ్ల నుంచే బయటికి రావొద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లే మూడ్ లో ఎవరూ ఉండరు. ఆంధ్రాలోనూ కొన్ని చోట్ల చినుకులు జల్లులు పడుతున్నాయి కానీ మరీ తెలంగాణ అంత తీవ్రంగా కాదు. అయినా సరే ఏపీ కలెక్షన్లలో పెద్దగా పికప్ లేదు. నైజామ్ లో ఒన్ చేసుకున్నంతగా ఇతర ప్రాంతాల్లో ఖుషిని రిసీవ్ చేసుకోలేదన్న విషయం తేటతెల్లమవుతోంది.
ఓవర్సీస్ సంగతి చూస్తే అక్కడ ఖుషి స్పీడ్ చాలా బాగుంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఇరవై కోట్లకు పైగానే రావాలి. అదంత ఈజీ కాదు. ఎందుకంటే జవాన్ ఫీవర్ మెల్లగా ఎక్కేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే యావరేజ్ టాక్ వచ్చినా చాలు షారుఖ్ ఖాన్ ఊచకోత చేసేలా ఉన్నాడు. అనూహ్యంగా దక్షిణాదిలోనూ గ్రాండ్ ఓపెనింగ్స్ కి దారులు తెరుచుకుంటున్నాయి. అలాంటప్పుడు ఖుషి అనూహ్యంగా పికప్ కావడం అంత సులభం కాదు. పైగా ఇదే వారంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఉంది. సో లాభాల్లోకి ప్రవేశించడమనే టాస్క్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఖుషికి పెద్ద సవాల్ గా మారింది.
This post was last modified on September 5, 2023 11:48 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…